భార్యతో జాలీగా హర్బజన్ టూర్ | Harbhajan Singh Trip with his wife and daughter | Sakshi
Sakshi News home page

భార్యతో జాలీగా హర్బజన్ టూర్

Published Sun, Dec 11 2016 5:51 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

భార్యతో జాలీగా హర్బజన్ టూర్

భార్యతో జాలీగా హర్బజన్ టూర్

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫ్యామిలీ ఫొటో వైరల్ గా మారింది. గతేడాది గీతా బస్రాను పెళ్లిచేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన భజ్జీ గత జూలైలో తండ్రిగా ప్రమోషన్ పొందాడు. భార్య గీతా బస్రా, కూతురు 'హినయ హీర్‌ ప్లహా'తో కలిసి దిగిన ఓ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

ట్రావెల్ టైమ్ విత్ ఫ్యామిలీ అని క్యాప్షన్ పెట్టాడు భజ్జీ. ఇక అంతే శనివారం ఉదయం హర్బజన్ పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హర్బజన్ భార్య గీతా బస్రా చేతిలో ట్రావెల్ టికెట్లు ఉండటాన్ని ఫొటోలో గమనించవచ్చు.  కొందరు ఫ్యాన్స్ దీనిపై కామెంట్ చేశారు. బ్యూటిఫుల్ కపుల్ అని కొందరు, స్వీట్ ఫ్యామిలీ పాజీ అని, హ్యాపీ జర్నీ భజ్జీ అని ఇలా హర్బజన్ అభిమానులు, ఫాలోయర్స్ కామెంట్ చేశారు. టీమిండియా జెర్సీలో మళ్లీ ఎప్పుడూ కనిపిస్తావు భజ్జీ అని కొందరు కామెంట్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement