
టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్, నటి గీతా బస్రా ఇటీవల జన్మించిన తమ కుమారుడికి పేరు పెట్టారు. ఈ నెల జన్మించిన తమ ముద్దుల తనయుడికి జోవన్ వీర్‌గా నామకరణం చేసినట్లు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు గీతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు ద్వారా తెలియజేశారు. ఇందులో కూతురు హినయ తన తమ్ముడిని అప్యాయంగా చేతులోకి తీసుకున్నఫోటోను షేర్ చేస్తూ.. ‘పరిచయం చేస్తున్నాం మా హీర్ కా వీర్ జోవన్ వీర్ సింగ్ ప్లాహా’ అని కామెంట్ చేశారు. ఇక ఈ పోస్టుపై అభిమానులు స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.
కాగా గత నెలలో హర్భజన్ మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఆయన భార్య గీతా బస్రా మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్ సింగ్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు. తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చినట్లు.. తల్లి బిడ్డా క్షేమంగా తెలిపాడు. అయితే హర్భజన్, గీత దంపతులకు ఇప్పటికే ఓ కుమార్తె ఉంది. 2016 లో ఈ దంపతులు మొదటిసారిగా తల్లిదండ్రులయ్యారు. ఆ పాపకు హీర్ ప్లాహా అనే పేరు పెట్టారు. గీతా బాలీవుడ్ లో ‘దిల్ దియా హై’, ‘ది ట్రైన్’ వంటి పలు సినిమాల్లో నటించింది. గీత, హర్భజన్ లు ప్రేమించుకుని 2015 లో పెళ్లి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment