పాండ్యా, రాహుల్‌కు బీసీసీఐ నోటీసులు | Hardik Pandya Apologizes For His Comments At Koffee With Karan | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 9 2019 12:53 PM | Last Updated on Wed, Jan 9 2019 2:13 PM

Hardik Pandya Apologizes For His Comments At Koffee With Karan - Sakshi

హిందీ పాపులర్‌ టీవీ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’లో మహిళలపట్ల అనుచితంగా మాట్లాడిన ఇండియన్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా క్షమాపణలు చెప్పాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఈ ఆల్‌రౌండర్‌ కొన్ని వారాల క్రితం ‘కాఫి విత్‌ కరణ్‌’లో మహిళల పట్ల అగౌరవంగా కామెంట్‌ చేశాడు.  ‘షోలో నేను మాట్లాడిన మాటలు ఎవరినైనా కించపరిచేవిగా ఉంటే క్షమించండి. ఆ షో తీరుకు భిన్నంగా వ్యవహరించాను. అయితే, ఉద్దేశపూర్వకంగా ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అలా మాట్లాడలేదు’ అని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. 

టీవీ షోలో హార్దిక్‌ ఏమన్నాడంటే..
కొన్ని వారాల క్రితం కాఫీ విత్‌ కరణ్‌లో పాండ్యా.. ‘మా అమ్మానాన్నలతో ప్రతి విషయం షేర్‌ చేసుకుంటాను. సెక్స్‌కి సంబంధించిన విషయాలు కూడా చెప్పేస్తా. అమ్మాయిలతో గడిపిన క్షణాలను సైతం వారి దగ్గర దాచను. నా వర్జినిటీ కోల్పోయిన సందర్భం కూడా వారికి చెప్పా’ అని చెప్పుకొచ్చాడు పాండ్యా. అంతేకాకుండా మహిళలను ఉద్దేశించి ఏకవచనంతో.. ఇది.. అది.. హేళనగా మాట్లాడాడు. దీంతో హార్దిక్‌పై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ టీవీ కార్యక్రమంలో హార్దిక్‌తో పాటు కేఎల్‌ రా్‌హుల్‌ కూడా పాల్గొన్నాడు. 

24 గంటల్లో వివరణ ఇవ్వాలి..
మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన హార్దిక్‌ పాండ్యాకు, అతనితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న కేఎల్‌ రాహుల్‌కు ఇండియన్‌ క్రికెట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కమిటీ బుధవారం షోకాజ్‌ నోటీసులు పంపింది. నోటీసులపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement