
భారత క్రికెటర్ చేతన్ సకారియా పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు

జూలై 14 తన వివాహం జరిగినట్లు తాజాగా వెల్లడించాడు

తన భార్య పేరు మేఘన అని తెలిపిన చేతన్ సకారియా.. పెళ్లి ఫొటోలు షేర్ చేశాడు

నువ్వు నేను.. నేను నువ్వైన రోజు అంటూ లవ్‌లీ క్యాప్షన్ జత చేశాడు

2021లో రాజస్తాన్ రాయల్స్ ద్వారా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు సకారియా

ఈ లెఫ్టార్మ్ పేసర్ అరంగేట్ర సీజన్‌లో 4 వికెట్లతో సత్తా చాటాడు

ఈ క్రమంలో మరుసటి ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 4.20 కోట్లు ఖర్చు పెట్టి అతడిని కొనుగోలు చేసింది

అయితే, పెద్దగా ఆడే అవకాశం మాత్రం రాలేదు. రెండేళ్లు ఢిల్లీ జట్టులో కొనసాగిన సకారియా.. ఆరు వికెట్లు మాత్రమే తీశాడు

ఈ క్రమంలో ఢిల్లీ ఈ సౌరాష్ట్ర ప్లేయర్‌ను విడిచిపెట్టగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 50 లక్షలకు కొనుక్కుంది.

ఐపీఎల్-2024లో చేతన్ సకారియాకు ఆడే అవకాశం రాకపోయినా ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు కావడం విశేషం

గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల చేతన్ సకారియా 2021లో టీమిండియా తరఫున వన్డే, టీ20లలో అరంగేట్రం చేశాడు. ఒక వన్డే, రెండు టీ20లు ఆడి 2, ఒక వికెట్ తీశాడు.