టీమిండియా స్టార్.. కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. మెర్సీడెస్‌కు చెందిన ఎస్‌యూవీ లగ్జరీ మెర్సీడెస్-ఏంఎంజీ జి 63ని రూ. 2.45కోట్లు పెట్టి కొన్నాడు. అయ్యర్ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయ్యర్ కొనుగోలు చేసిన కారు కేవలం 4.5 సెకన్లలో 100కిమీ వేగాన్ని అందుకుంటుంది. కాగా అయ్యర్ కారుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన మెర్సిడెస్ లగ్జరీ కార్ల కంపెనీ ట్వీట్ చేసింది.
''కంగ్రాట్స్ టూ టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్. అలాగే మా మెర్సిడెస్ బెంజ్ ఫ్యామిలీలోకి మీకు స్వాగతం. మెర్సిడెస్ బెంజ్‌లో కొత్త మోడల్ కారును కొనుగోలు చేసినందుకు ధన్యవాదాలు. మీ బ్యాటింగ్‌లో కవర్ డ్రైవ్స్ మేము బాగా ఎంజాయ్ చేస్తాం.. ఇప్పుడు మీరు మా కారు డ్రైవింగ్‌ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది.
ఇక ఐపీఎల్ 2022 సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ జట్టును విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లోనూ అంతగా రాణించని శ్రేయాస్ అయ్యర్.. కెప్టెన్‌గానూ మెరవలేదు. రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన కేకేఆర్ ఐపీఎల్ 15వ సీజన్‌ను ఏడో స్థానంతో ముగించింది. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న సౌతాఫ్రికా సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ ఎంపికయ్యాడు. సీనియర్ల గైర్హాజరీలో శ్రేయాస్ అయ్యర్ జట్టుకు కీలకం కానున్నాడు. ఈ సిరీస్ ద్వారా శ్రేయాస్ తన ఫామ్‌ను తిరిగి అందుకుంటాడని క్రికెట్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: బిగ్‌స్క్రీన్‌పై చారిత్రక టెస్టు సిరీస్.. రోమాలు నిక్కబొడుచుకునేలా ట్రైలర్
Liam Livingstone: బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా!
Comments
Please login to add a commentAdd a comment