new cars purchase
-
2024 లో మార్కెట్లోకి రానున్న 24 కొత్త మోడల్ కార్లు
-
ఖరీదైన కారు కొనుగోలు చేసిన టీమిండియా క్రికెటర్
టీమిండియా స్టార్.. కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. మెర్సీడెస్కు చెందిన ఎస్యూవీ లగ్జరీ మెర్సీడెస్-ఏంఎంజీ జి 63ని రూ. 2.45కోట్లు పెట్టి కొన్నాడు. అయ్యర్ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయ్యర్ కొనుగోలు చేసిన కారు కేవలం 4.5 సెకన్లలో 100కిమీ వేగాన్ని అందుకుంటుంది. కాగా అయ్యర్ కారుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన మెర్సిడెస్ లగ్జరీ కార్ల కంపెనీ ట్వీట్ చేసింది. ''కంగ్రాట్స్ టూ టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్. అలాగే మా మెర్సిడెస్ బెంజ్ ఫ్యామిలీలోకి మీకు స్వాగతం. మెర్సిడెస్ బెంజ్‌లో కొత్త మోడల్ కారును కొనుగోలు చేసినందుకు ధన్యవాదాలు. మీ బ్యాటింగ్‌లో కవర్ డ్రైవ్స్ మేము బాగా ఎంజాయ్ చేస్తాం.. ఇప్పుడు మీరు మా కారు డ్రైవింగ్‌ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక ఐపీఎల్ 2022 సీజన్లో కేకేఆర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ జట్టును విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లోనూ అంతగా రాణించని శ్రేయాస్ అయ్యర్.. కెప్టెన్‌గానూ మెరవలేదు. రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన కేకేఆర్ ఐపీఎల్ 15వ సీజన్‌ను ఏడో స్థానంతో ముగించింది. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న సౌతాఫ్రికా సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ ఎంపికయ్యాడు. సీనియర్ల గైర్హాజరీలో శ్రేయాస్ అయ్యర్ జట్టుకు కీలకం కానున్నాడు. ఈ సిరీస్ ద్వారా శ్రేయాస్ తన ఫామ్‌ను తిరిగి అందుకుంటాడని క్రికెట్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బిగ్స్క్రీన్పై చారిత్రక టెస్టు సిరీస్.. రోమాలు నిక్కబొడుచుకునేలా ట్రైలర్ Liam Livingstone: బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా! -
ఇంటికి చేరుకున్న ఎన్టీఆర్ లగ్జరీ లంబోర్ఘిని, ధర ఎంతంటే..
సినీ సెలబ్రెటీలకు ఖరీదైన కార్లు అంటే మక్కువ ఎక్కువ. మార్కేట్లోకి కొత్తరకం మోడల్ కార్లు వస్తే చాలు వాటిని తమ సొంత చేసుకుంటారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు బీఎండబ్ల్యూ, రేంజ్‌రోవర్, మెర్సిడేస్, ఆడి వంటీ కార్లను తమ గ్యారేజ్‌లో చేర్చుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేసి దేశంలోనే తొలి వ్యక్తిగా నిలిచాడు. కాగా ఇటీవల తారక్ అంత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ కారును ఖరీదు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాలో లాంచ్ అయిన తొలి రోజే ఈ కారును ఎన్టీఆర్ బుక్ చేసుకున్నాడు. 3.16 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన లంబోర్ఘినీ ఊరుస్ బుధవారం ఇటలీ నుంచి శంషాబాద్ ఎయిరపోర్టుకు ఆ తర్వాత తారక్ ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం దీని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థయే ‘లంబోర్ఘిని’. ప్రపంచ వ్యాప్తంగా గతేడాది ఈ కార్లను ఉత్పత్తి చేయగా.. ఇండియాలో సోమవారం రోజున దీనిని అధికారింగా లాంచ్ అయ్యింది. (చదవండి: ‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ) ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. 3,16 కోట్ల రూపాయల విలువ చేసే ఈ కారు ఫుల్ ఆటోమేటేడ్ అట. ఇక బుల్లెట్ ఫ్రూవ్ అని కూడా చెబుతున్నారు. 200 కిమీ వేగంతో వెళుతున్నప్పటికీ ఎలాంటి కుదుపులు ఉండవట. పైగా 2 నిమిషాల్లో 200 స్పీడుకు వెళ్లి.. మళ్లీ 1 నిమిషంలో 10 కి.మీ తగ్గించినా ఎలాంటి ఒడిదుడుకులు లోను కాదట. అంతేకాదు ఇందులో ఆటో సెన్సర్ మిషన్స్ కూడా ఉండటంతో ఎదురుగా వాహనాలు ఉంటే అలర్ట్ చేస్తుందట. ఆటోమేటేడ్ కారు తాళాలు ఈ కారు ప్రత్యేకత. ఎలాంటి ప్రమాదం జరిగిన కారు అద్దాలు, కానీ డోర్లు కానీ అంత ఈజీ తెరచుకోవట. ఫుల్లీ ఆటోమెటెడ్, సెఫ్టీతో లంబోర్ఘినిని తయారు చేశారు. దీంతో ఎన్టీఆర్ లంబోర్ఘీన ఊరుస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ గ్యారేజ్ 20పైగా కార్లు ఉన్నాయట. -
కరోనా వేళ మంత్రులకు కొత్త కార్లు
ముంబై: కరోనా పంజా విసురుతుండగా, ప్రజాధనంతో కొత్త కార్లు కొనుక్కోవడానికి మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. అధికారిక వాహనం కొనుగోలు చేసుకోవడానికి విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌కు అనుమతి ఇస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే జూలై 3న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ ఇందుకోసం రూ.22.83 లక్షలు మంజూరు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తప్పుపట్టారు. కరోనా బాధితులను ఆదుకోవాల్సింది పోయి మంత్రులకు కొత్త వాహనాలు సమకూర్చడం ఏమిటని మండిపడ్డారు. కరోనాపై పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వాయిదా వేస్తూ.. మంత్రుల కోసం ప్రజాధనం ఫలహారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
కారు కొంటున్నారా.. పార్కింగ్ ప్లేస్ ఏది?
మీరు కారు కొనాలనుకుంటున్నారా.. అయితే దాన్ని పార్క్ చేయడానికి మీ ఇంట్లో తగినంత స్థలం ఉందన్న ఆధారం చూపిస్తే తప్ప మీకు కారు అమ్మబోరు. ఈ నిబంధన త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయమై తాను చాలా పట్టింపుతో ఉన్నానని, దీనిపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రితో మాట్లాడానని, రాష్ట్రాలకు కూడా చెబుతున్నానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నుంచి అలాంటి ప్రతిపాదన వస్తే దాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ అధికారులు కూడా అంటున్నారు. పార్కింగ్ కోసం తగినంత స్థలం లేకపోయినా కార్లు, ఇతర వాహనాలు కొనేసి, వాటిని ఇళ్ల ముందు రోడ్ల మీద ఉంచేయడం పెద్ద నగరాల్లో చాలా తీవ్రమైన సమస్యగా మారింది. దానివల్ల రోడ్లు ఇరుగ్గా తయారవడంతో ఇక ఈ సమస్యపై దృష్టి పెట్టాల్సిందేనని కేంద్రం గట్టి పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాహనాల రిజిస్ట్రేషన్ విషాన్ని రవాణా శాఖ చూస్తుండగా, పార్కింగ్ విషయాన్ని మునిసిపల్ శాఖ చూస్తోంది. దానివల్ల ఈ రెండు శాఖల మధ్య సమన్వయం సాధించి ఆ తర్వాతే ఈ నిబంధన అమలు చేయాలనుకుంటున్నారు. పైగా, దాంతోపాటు.. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచిన తర్వాతే దీన్ని కచ్చితంగా అమలుచేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఇటు ప్రజారవాణా లేక, అటు సొంత వాహనాలు కొనలేక ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. పార్కింగ్ చార్జీలు పెండచం, ఇరుకైన ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలు వాడితే చార్జీలు విధించడం, కార్ల రుణాల మీద వడ్డీరేట్లు పెంచడం లాంటి చర్యల ద్వారా ఎక్కువ మంది ప్రజలు సొంత కార్లు కొనకుండా చూడొచ్చని కొంతమంది రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు. సింగపూర్ లాంటి దేశాల్లో సొంత వాహనాలు అన్నవే దాదాపుగా ఉండవు. కేవలం ప్రజా రవాణాను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. మరీ అంత కాకపోయినా.. కొంతవరకు నియంత్రణ విధించకపోతే వ్యక్తిగత వాహనాల సంఖ్య బాగా పెరిగి ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా లాంటి నగరాల్లో అక్రమంగా రోడ్ల మీదే వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల రోడ్లు చాలా ఇరుకైపోయాయి. హైదరాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. సొంత పార్కింగ్ ప్రదేశం ఉందని సర్టిఫికెట్ తీసుకొచ్చిన వారికి మాత్రమే షిమ్లా మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్లు అమ్మాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు 2015లోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.