ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ప్రదర్శించిన ఆటతీరునే రెండో ఇన్నింగ్స్‌లోనూ చూపిస్తుంది. కాకపోతే అప్పుడు వంద పరుగులు చేయడానికి నానా కష్టాలు పడితే.. ఇప్పుడు మాత్రం 150 పరుగుల మార్క్‌ను అందుకోవడానికి యత్నిస్తుంది. గింగిరాలు తిరుగుతున్న బంతితో బ్యాటర్లు ముప్పతిప్పలు పడుతున్నారు.
తాజాగా పుజారాతో కలిసి రెండో ఇన్నింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్ కాస్త ప్రతిఘటించాడు. 26 పరుగులతో కుదురుకున్నాడని అనుకునే లోపే ఉస్మాన్ ఖవాజా స్టన్నింగ్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో అర్థసెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఉస్మాన్ ఖవాజా ఫీల్డింగ్‌లోనూ తన విన్యాసంతో అదరగొట్టాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి దూకుడుగా ఆడిన శ్రేయాస్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 26 పరుగులతో జోరు కనబర్చాడు.
కానీ అతని దూకుడుకు ఉస్మాన్ ఖవాజా ముకుతాడు వేశాడు. అయ్యర్ 26 పరుగుల వద్ద ఉండగా.. స్టార్క్ బౌలింగ్‌లో డీప్ మిడ్‌వికెట్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న ఖవాజా బ్లైండర్ క్యాచ్ అందుకున్నాడు. ఒకవైపుగా డైవ్‌చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు. అయితే అంపైర్‌కు క్యాచ్‌పై స్పష్టత లేకపోవడంతో సాఫ్ట్ సిగ్నల్ కోసం థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించాడు. రిప్లేలో ఖవాజా బంతిని ఎక్కడా నేలకు తగిలించినట్లు కనిపించకపోవడంతో అయ్యర్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతుంది. రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం టీమిండియా స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 132 పరుగులుగా ఉంది. పుజారా 49, అశ్విన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. లియోన్ నాలుగు వికెట్లు తీయగా కుహ్నెమన్, మిచెల్ స్టార్క్‌లు చెరొక వికెట్ తీశారు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌట్ అయింది.
— IPLT20 Fan (@FanIplt20) March 2, 2023
చదవండి: పుజారా భయపడుతున్నాడు.. అయ్యర్ పిరికిపందలా ఉన్నాడు: ఆసీస్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment