
43 డిగ్రీల వేడిలో యోగా
ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో శిక్షణ తీసుకుంటున్న భారత క్రికెటర్ సురేశ్ రైనా ప్రతి రోజూ 43 డిగ్రీల వేడిలో యోగా చేస్తున్నాడు. ‘కృత్రిమంగా వేడిని సృష్టించి అందులో ఇలాంటి యోగా చేయడం వల్ల మరింత ఫిట్‌గా తయారవ్వొచ్చు. దీనివల్ల కండరాలు బలంగా తయారవడంతో పాటు మానసికంగా కూడా బాగా దృఢంగా తయారవుతాం. ఈ కొత్త శిక్షణతో నాలో ఉత్సాహం బాగా పెరిగింది’ అని రైనా చెప్పాడు. అలాగే నెదర్లాండ్స్ జాతీయ జట్టుతో కలిసి రైనా ప్రతిరోజూ క్రికెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నాడు.