
అనంతపురం: భారత క్రికెటర్ రోహిత్ శర్మ ప్రపంచ స్థాయి క్రీడాకారుడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్ ప్రశంసించాడు. సొంతగడ్డపై టెస్టుల్లోనూ రోహిత్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఆకట్టుకోగలడని అతను ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లాంటి చోటకు వెళ్లినప్పుడు కష్టం కావచ్చేమో కానీ భారత గడ్డపై మాత్రం టెస్టుల్లో రోహిత్ ఓపెనర్‌గా కచ్చితంగా రాణిస్తాడు. అతనో గొప్ప క్రీడాకారుడు. కానీ చూసేవారికి టెస్టుల కోసం రోహిత్ పెద్దగా శ్రమించట్లేదేమో అనిపిస్తుంది. నిజానికి అతను ప్రపంచ స్థాయి క్రీడాకారుడు. ఏ ఫార్మాట్‌లోనైనా అభిమానులను ఆకట్టుకోగలడు’ అని గిల్‌క్రిస్ట్ అన్నాడు. ఐపీఎల్‌లో దక్కన్ చార్జర్స్ జట్టు తరఫున వీరిద్దరూ ప్రాతినిధ్యం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment