Gilchrist
-
బాల్ టాంపరింగ్ వివాదంలో మరికొందరి ప్రమేయం..
మెల్బోర్న్: మూడేళ్ల కిందట జరిగిన బాల్ టాంపరింగ్ వివాదంలో రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తుంది. ఆ వివాదంలో ప్రధాన సూత్రధారి అయిన బాన్‌క్రాఫ్ట్ ఇటీవల సంచలన విషయాలను వెల్లడించగా, తాజాగా ఆసీస్ దిగ్గజ ఆటగాడు గిల్‌క్రిస్ట్, డేవిడ్ వార్నర్ మేనేజర్ జేమ్స్, ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌లు చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రక్తి కట్టించాయి. ఈ విషయమై తొలుత బాన్‌క్రాఫ్ట్ మాట్లాడుతూ.. 2018లో సఫారీలతో జరిగిన మూడో టెస్ట్‌లో తాను సాండ్ పేపర్ వాడిన విషయం తమ బౌలర్లకు ముందే తెలుసని బాంబు పేల్చగా, తాజాగా ఆసీస్ లెజండరీ ఆటగాడు గిల్లీ మాట్లాడుతూ.. బాల్ టాంపరింగ్ జరిగిన విషయం బాన్‌క్రాఫ్ట్‌తో పాటు మరికొంత మందికి ముందే తెలుసని, ఆ పేర్లను బయటపెట్టేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపునకు లోను చేసిన ఈ ఉదంతంపై వార్నర్ మేనేజర్ జేమ్స్ మాట్లాడుతూ.. నాడు జరిగిన విచారణ ఏకపక్షంగా సాగిందని, ఈ విషయమై నిషేదానికి గరైన ఆటగాళ్లు కోర్టును ఆశ్రయించి ఉంటే తప్పక కేసు గెలిచే వాళ్లని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్ స్పందిస్తూ.. బాల్ టాంపరింగ్ జరిగిన విషయం ఆ ముగ్గురితో పాటు ఇంకా ఎవరికైనా ముందే తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు. కాగా, ఈ వివాదంలో బాన్‌క్రాఫ్ట్‌తోపాటు నాటి జట్టు కెప్టెన్ స్టీవ్‌స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు ఏడాది పాటు నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. చదవండి: భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా జరుగనుంది.. -
రోహిత్ ఓపెనింగ్‌కు గిల్లీ మద్దతు
అనంతపురం: భారత క్రికెటర్ రోహిత్ శర్మ ప్రపంచ స్థాయి క్రీడాకారుడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్ ప్రశంసించాడు. సొంతగడ్డపై టెస్టుల్లోనూ రోహిత్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఆకట్టుకోగలడని అతను ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లాంటి చోటకు వెళ్లినప్పుడు కష్టం కావచ్చేమో కానీ భారత గడ్డపై మాత్రం టెస్టుల్లో రోహిత్ ఓపెనర్‌గా కచ్చితంగా రాణిస్తాడు. అతనో గొప్ప క్రీడాకారుడు. కానీ చూసేవారికి టెస్టుల కోసం రోహిత్ పెద్దగా శ్రమించట్లేదేమో అనిపిస్తుంది. నిజానికి అతను ప్రపంచ స్థాయి క్రీడాకారుడు. ఏ ఫార్మాట్లోనైనా అభిమానులను ఆకట్టుకోగలడు’ అని గిల్‌క్రిస్ట్ అన్నాడు. ఐపీఎల్లో దక్కన్ చార్జర్స్ జట్టు తరఫున వీరిద్దరూ ప్రాతినిధ్యం వహించారు. -
విరాట్ పై గిల్ క్రిస్ట్ ప్రశంసలు
మెల్బోర్న్:భారత క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. గత కొంతకాలంగా విరాట్ బ్యాటింగ్ అమోఘంగా ఉందని కొనియాడాడు. విరాట్ ఆటగాడిగానే కాదు.. కెప్టెన్‌గా కూడా సఫలమయ్యాడన్నాడు. 'విరాట్ ఆట తీరు అసాధారణం. నా దృష్టిలో విరాట్ లో నాయకత్వ లక్షణాలు కూడా అమోఘం. విరాట్ ఎప్పుడైతే టెస్టు పగ్గాలు తీసుకున్నాడో అప్పుడే భారత క్రికెట్ జట్టులో దూకుడు పెంచాడు. మూడు ఫార్మెట్లలో విరాట్ ముద్ర స్పష్టంగా కనబడుతోంది. భారత జట్టు విజయాల్లో విరాట్ పాత్ర ఎనలేనిది ' అని గిల్ క్రిస్ట్ పేర్కొన్నాడు. అయితే పరిమిత ఓవర్ల కెప్టెన్ గా విరాట్‌కు బాధ్యతలు అప్పజెప్పడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నారా?అని మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రం గిల్ క్రిస్ట్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఆ విషయాన్ని తాను ఎలా చెప్పగలుగుతానని గిల్ క్రిస్ట్ ఎదురు ప్రశ్నించాడు. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ గా ఉన్న ఎంఎస్ ధోని ఇంకా ఆడతానని ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో విరాట్ నాయకత్వ పగ్గాలపై తాను మాట్లాడటం ఎంతమాత్రం సరికాదన్నాడు. -
లెజెండ్స్ లీగ్ బ్లూ ప్రింట్ సిద్ధం
దుబాయ్: క్రికెట్ దిగ్గజాలు సచిన్, షేన్‌వార్న్ కలిసి ఏర్పాటు చేయబోతున్న లెజెండ్స్ టి20కి సంబంధించిన బ్లూ ప్రింట్ సిద్ధమైంది. ఈ ఇద్దరూ కలిసి దీనిని ఐసీసీ ముందు ఉంచారు. ఐసీసీ సీఈ డేవ్ రిచర్డ్సన్ను కలిసిన సచిన్, వార్న్ లీగ్ విధివిధానాలను వివరించారు. అమెరికాలో ఆగస్టు, సెప్టెంబర్లలో తొలి సిరీస్ జరగనుంది. న్యూయార్క్, లాస్ఏంజెల్స్, చికాగో నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఫ్లింటాఫ్, బ్రెట్‌లీ, గంగూలీ, గిల్‌క్రిస్ట్, కలిస్, జయవర్ధనే, మెక్‌గ్రాత్ ఇప్పటికే ఈ లీగ్‌లో పాల్గొనేందుకు అంగీకరించారు. మూడున్నరేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అయితే ఈ టోర్నీకి తమ అనుమతి అవసరం లేదని ఐసీసీ అధికార ప్రతినిధి తెలిపారు. మ్యాచ్‌లు ఏ దేశంలో నిర్వహిస్తే ఆ దేశ క్రికెట్ బోర్డు అనుమతి ఉంటే చాలని ప్రకటించారు. టోర్నీని ఐసీసీ దృష్టిలో ఉంచాలనే ఉద్దేశంతో సచిన్, వార్న్ తమ ప్రణాళికలను రిచర్డ్సన్కు వివరించినట్లు సమాచారం. -
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో గిల్‌క్రిస్ట్, వకార్
దుబాయ్: ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. వచ్చే వారం ఈ ఇద్దరి పేర్లను ఐసీసీ ఈ జాబితాలో చేర్చనుంది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 70వ సభ్యుడిగా గిల్లీ, 71వ సభ్యుడిగా యూనిస్ నిలిచారు. ఈనెల 11న దుబాయ్‌లో పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగే తొలి టి20 మ్యాచ్ సందర్భంగా యూనిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరనుండగా రెండు రోజుల అనంతరం పెర్త్‌లో ఆసీస్, ఇంగ్లండ్ యాషెస్ టెస్ట్ టీ విరామంలో గిల్‌క్రిస్ట్ ఈ ఘనత సాధించనున్నాడు. ఈనెల చివర్లో మరో ఇద్దరి పేర్లను ఐసీసీ ప్రకటించనుంది. పాక్ నుంచి ఇప్పటికే హనీఫ్ మహ్మద్, ఇమ్రాన్ ఖాన్, మియాందాద్, అక్రం హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఉండగా ఆసీస్ నుంచి 18 మంది క్రికెటర్లున్నారు.