ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో గిల్‌క్రిస్ట్, వకార్ | Waqar, Gilchrist to be inducted into ICC Hall of Fame | Sakshi
Sakshi News home page

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో గిల్‌క్రిస్ట్, వకార్

Published Tue, Dec 10 2013 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో గిల్‌క్రిస్ట్, వకార్

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో గిల్‌క్రిస్ట్, వకార్

దుబాయ్: ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. వచ్చే వారం ఈ ఇద్దరి పేర్లను ఐసీసీ ఈ జాబితాలో చేర్చనుంది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 70వ సభ్యుడిగా గిల్లీ, 71వ సభ్యుడిగా యూనిస్ నిలిచారు. ఈనెల 11న దుబాయ్‌లో పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగే తొలి టి20 మ్యాచ్ సందర్భంగా యూనిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరనుండగా రెండు రోజుల అనంతరం పెర్త్‌లో ఆసీస్, ఇంగ్లండ్ యాషెస్ టెస్ట్ టీ విరామంలో గిల్‌క్రిస్ట్ ఈ ఘనత సాధించనున్నాడు. ఈనెల చివర్లో మరో ఇద్దరి పేర్లను ఐసీసీ ప్రకటించనుంది. పాక్ నుంచి ఇప్పటికే హనీఫ్ మహ్మద్, ఇమ్రాన్ ఖాన్, మియాందాద్, అక్రం హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఉండగా ఆసీస్ నుంచి 18 మంది క్రికెటర్లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement