టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పతాగి వాహనం నడపడంతో పాటు ఓ కారును ఢీకొట్టినందుకుగాను అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
అయితే లాయర్ ష్యూరిటీ ఇవ్వడంతో కొద్దిసేపటికే బెయిల్‌పై విడుదల చేశారు. కాంబ్లీపై ఐపీసీ సెక్షన్లు 279 (ర్యాష్ డ్రైవింగ్), 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం), 427 (నష్టం కలిగించే అల్లర్లు) కింద అభియోగాలు మోపామని బాంద్రా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
కాగా, ఇటీవలి కాలంలో కాంబ్లీ వార్తల్లోకెక్కడం ఇది రెండోసారి. గతేడాది డిసెంబర్ 11న అతను సైబర్ మోసానికి గురై పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు.సైబర్ మోసగాళ్ల వలలో చిక్కిన కాంబ్లీ.. 1.14 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. బ్యాంకు అధికారినని ఫోన్ చేసిన మోసగాడు.. కాంబ్లీని బురిడీ కొట్టించి అకౌంట్లో డబ్బులు మాయం చేశాడు.
చదవండి: IND VS SL 3rd T20: కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్
Comments
Please login to add a commentAdd a comment