దుబాయ్: భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు బౌలింగ్ శైలిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సందేహం వ్యక్తం చేసింది. శనివారం సిడ్నీలో జరిగిన తొలి వన్డే అనంతరం మ్యాచ్ అధికారులు తమ నివేదికలో రాయుడు ఆఫ్‌స్పిన్ బౌలింగ్ యాక్షన్‌ను తప్పు పట్టారు. ఈ నివేదికను ఐసీసీ భారత టీమ్ మేనేజ్‌మెంట్‌కు అందజేసింది. అతను 14 రోజుల్లోగా పరీక్షకు హాజరు కావాలని తేల్చి చెప్పింది. అయితే తుది ఫలితం వచ్చే వరకు మాత్రం రాయుడు తన బౌలింగ్‌ను కొనసాగించవచ్చు. పార్ట్‌టైమ్ స్పిన్నర్ రాయుడు తన 46 మ్యాచ్‌ల వన్డే కెరీర్‌లో 20.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు దేశవాళీ వన్డేలు, టి20ల్లో అతను ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు. సిడ్నీ వన్డేలో 2 ఓవర్లు వేసిన రాయుడు 13 పరుగులిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment