Sania-Shoaib Divorce Rumours: Bold Photos With Ayesha Omar Go Viral
Sakshi News home page

Sania- Shoaib: సానియా- షోయబ్‌ విడాకుల రూమర్లు! మోడల్‌తో మాలిక్‌ ఫొటోలు వైరల్‌.. మీ భర్త కూడా ఇలాగే..

Published Fri, Nov 11 2022 2:32 PM | Last Updated on Fri, Nov 11 2022 3:29 PM

Sania Shoaib Malik Divorce Rumours His Old Bold Photoshoot With Model Viral - Sakshi

భర్తతో సానియా మీర్జా(PC: Shoaib Malik)- మోడల్‌తో ఫొటోషూట్‌లో షోయబ్‌ మాలిక్‌(PC:Ayesha Omar Instagram )

Sania Mirza- Shoaib Malik- Ayesha Omar: సోషల్‌ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు అభిమానులకు మరింతగా చేరువయ్యే అవకాశం దొరికింది. తమ వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలు పంచు​కునే వెసలుబాటు కలిగింది.

అయితే, ఒక్కోసారి నోరు తెరచి స్వయంగా ఏ విషయం చెప్పకపోయినా.. నేరుగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా సరే.. వాళ్లు షేర్‌ చేసే ఫొటోలు, వాటికి జత చేసే క్యాప్షన్లు చాలు.. వాళ్ల పర్సనల్‌ లైఫ్‌ గురించి వదంతులు వ్యాపించడానికి!

క్రీడా జంట సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ విషయంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా- పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ విడాకులకు సిద్ధమయ్యారంటూ రూమర్లు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే వీరిద్దరు విడిగా ఉంటున్నారని, విడాకులకు సంబంధించిన ప్రక్రియ పూర్తైన తర్వాత ప్రకటన చేయనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఆమే కారణం అంటూ!
అంతేకాదు.. ఓ పాకిస్తాన్‌ మోడల్‌ ఇందుకు కారణమని పాక్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె పేరు తెరపైకి రావడానికి కారణం ఏమిటంటే.. సదరు మోడల్‌ పేరు ఆయేషా ఒమర్‌. స్థానిక మ్యాగజీన్‌ కోసం షోయబ్‌ ఆమెతో కలిసి 2021లో ఓ బోల్డ్‌ ఫొటోషూట్‌ చేశాడు. హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌పై అవగాహనలో భాగంగా రూపొందించిన వీడియోలో తమ తమ రంగాల్లో నిష్ణాతులైన వీళ్లు ఆ ఫొటోషూట్‌లో చాలా సన్నిహితంగా కనిపించారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయేషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేశారు. షోయబ్‌ రెండో పెళ్లికి సిద్దమైనట్లుగా కనిపిస్తోంది అంటూ ఇష్టారీతిన కామెంట్లు చేశారు. స్విమ్మింగ్‌పూల్‌లో దిగి ఇలా ఫోజులివ్వడమే ప్రొఫెషనలిజమా అంటూ ప్రశ్నించారు. 

మీ భర్త కూడా ఇలాగే చేస్తే
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో షోయబ్‌ మాలిక్‌ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఫొటోషూట్‌ సమయంలో ఆయేషా తనకు సహకరించారంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఫొటోషూట్‌ గురించి మీ భార్య సానియా ఎలా స్పందించారని హోస్ట్‌ ప్రశ్నించగా.. సమాధానం దాటవేసిన షోయబ్‌.. ‘‘మీ భర్త కూడా ఇలాంటి ఫొటోషూట్‌లో పాల్గొంటే మీ రియాక్షన్‌ ఏంటీ’’అంటూ ఎదురు ప్రశ్నించాడు. 


PC: Ayesha Omar Instagram

ఇందుకు వెంటనే స్పందించిన ఆమె..‘‘నాకింకా పెళ్లి కాలేదు’’అని సమాధానమిచ్చింది. అవునా.. మీ లాగే సానియా కూడా రియాక్ట్‌ అవ్వలేదు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు తోడు ఇటీవల సానియా.. ‘‘హృదయం ముక్కలైందంటూ’’వరుస పోస్ట్‌లు చేస్తూ ఉండటం ఈ రూమర్లకు ఊతమిచ్చింది.


భార్యా కొడుకుతో షోయబ్‌ మాలిక్‌

ఆయేషా ఎవరంటే
ఆయేషా ఒమర్‌ నటి, గాయని, యూబ్యూబర్‌. 1981లో జన్మించిన ఆమె తొలుత వీడియో ఆల్బమ్‌లతో లైమ్‌లైట్‌లోకి వచ్చారు. 2015లో కరాచీ సే లాహోర్‌ అనే రొమాంటిక్‌ కామెడీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి కెరీర్‌ కొనసాగిస్తున్నారు. ఇక సానియా- షోయబ్‌ మాలిక్‌ విడాకుల వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఆయేషా- షోయబ్‌ మాలిక్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా 2010లో పెళ్లి చేసుకున్న సానియా- షోయబ్‌కు కుమారుడు ఇజహాన్‌ సంతానం.

చదవండి: T20 WC 2022 Final: ఇంగ్లండ్‌- పాక్‌ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్‌ రద్దు అయితే?
IND vs NZ: టీమిండియా హెడ్‌ కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement