New Rumours Of Divorce Between Shoaib Malik And Sania Mirza: Reports - Sakshi
Sakshi News home page

సానియా, మాలిక్ విడాకులు నిజ‌మేనా..!? మరోసారి తెరపైకి

Published Thu, Aug 3 2023 9:41 AM | Last Updated on Thu, Aug 3 2023 11:50 AM

Reports: New rumours of divorce between Shoaib Malik and Sania Mirza  - Sakshi

పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా విడాకుల ఆంశం​ మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో మార్పు చేయడమే ఇందుకు కారణం. ఇంతకుముందు షోయబ్ మాలిక్  ఇన్‌స్టాగ్రామ్ బయోలో 'సూపర్ ఉమెన్ సానియా మీర్జా' అని ఉండేది.

అయితే ఇప్పుడు ఆ వాక్యాన్ని బయో నుంచి తొలగించి.. తన వ్యక్తిగత  సమాచారాన్ని పొందుపరిచాడు. బయోలో ఇతర వివరాలతో పాటు "ఓ​ బిడ్డకు తండ్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉందంటూ" మాలిక్‌ రాసుకొచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మాలిక్‌, సానియా విడాకులు తీసుకోవడం ఖాయమని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.

గతంలో కూడా.. 
కాగా కొన్ని నెలల క్రితం కూడా సానియా,షోయబ్ మధ్య  విభేదాలు తలెత్తాయనీ, వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లు తెగ షికార్లు చేశాయి. పాకిస్తానీ నటి అయేషా ఉమర్‌తో మాలిక్‌ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ప్రచారం కూడా జరిగింది.

అయితే ఈ వార్తలను అయేషా కొట్టిపారేసింది. అవన్నీ పుకార్లే అని ఆమె సృష్టం చేసింది. అయితే ఇదే సమయంలో సానియా,షోయబ్‌ల కొత్త టాక్ షో 'ది మీర్జా మాలిక్ షో'రావడంతో వారి విడాకుల ఊహాగానాలకు తెరపడింది.

అయితే తాజాగా మాలిక్ చర్యతో మళ్లీ వారి విడాకుల వార్తలు  సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు సానియా, షోయబ్‌ ఎవరూ స్పందించలేదు.  కాగా సానియా, షోయబ్  2010లో వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో  ఇజహాన్‌  జన్మించాడు.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement