ఆయేషా పేరెంట్స్‌కు న్యాయం జరగాలి: సత్యంబాబు | sathyam babu release from rajahmundry central jail | Sakshi
Sakshi News home page

ఆయేషా పేరెంట్స్‌కు న్యాయం జరగాలి: సత్యంబాబు

Published Sun, Apr 2 2017 11:15 AM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

ఆయేషా పేరెంట్స్‌కు న్యాయం జరగాలి: సత్యంబాబు

ఆయేషా పేరెంట్స్‌కు న్యాయం జరగాలి: సత్యంబాబు

రాజమండ్రి : ఆయేషా హత్య కేసులో 8 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు ఆదివారం ఉదయం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా సత్యంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆయేషా హత్య కేసులో న్యాయం గెలిచిందన్నారు. తన కుటుంబం దీనస్థితిలో ఉందన్నారు. ఈ కేసులో తనకు ఆయేషా తల్లిదండ్రులు ఎంతో సహాయం చేశారని పేర్కొన్నారు.

ఆయేషా హత్య కేసులో తనకు ప్రమేయం లేదని మొదట్నుంచి ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారని గుర్తు చేశారు. ఆయేషా తల్లిదండ్రులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తనలాగే ఎంతోమంది అన్యాయంగా జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు. వారందరికీ ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఆయేషా హత్య కేసులో సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం విదితమే. హైకోర్టు తీర్పుతో సత్యంబాబు ఇవాళ విడుదలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement