
కేరళలో పుట్టి, చెన్నైలో పెరిగిన ఆయేషా...నందినిగా తెలుగువారికి సుపరిచితమే. ‘స్టార్ మా’టీవీలోప్రసారమవుతున్న ‘సావిత్రమ్మగారి అబ్బాయి’ సీరియల్‌ద్వారా ‘మా అమ్మాయే’ అని తెలుగునోట ప్రశంసలు
అందుకుంటున్న ఆయేషా చెబుతున్న ముచ్చట్లివి.
‘‘నన్ను తెలుగు ప్రేక్షకులు ‘మా అమ్మాయే’ అనుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ‘సావిత్రమ్మగారి అబ్బాయి’సీరియల్ బాగా పల్లె వాతావరణంతో ముడిపడి ఉంటుంది. బాలరాజు – నందినిల జోడీ చూడముచ్చటగా ఉందని అందరూఅంటున్నారు. అలాంటి ఫ్యామిలీ రియల్ లైఫ్‌లో దొరికితే సూపర్ హ్యాపీ (నవ్వుతూ). ఈ సీరియల్ చూస్తూ మా అమ్మ నాకుచెన్నై నుంచి ఫోన్ చేస్తారు ‘ఈ సన్నివేశంలో బాగా యాక్ట్ చేశావ్, ఇప్పుడు మీ అత్తగారు ఎలా ఉన్నారు?’ అంటూఫన్నీగా మాట్లాడతారు. ఏవైనా సజెషన్స్ ఉంటే చెబుతారు. ఇప్పుడు రోజులు చాలా సరదాగా జరిగిపోతున్నాయి.
తెలిసిన వారి ద్వారా!
చదువుకునే రోజుల్లో నుంచే యాక్టింగ్ అంటే బాగా ఇష్టం. నాకు ఓ తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. నాన్న బిజినెస్ మ్యాన్. అమ్మ గృహిణి. చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. నాకు ప్రొడక్షన్ టీమ్స్ ద్వారా సీరియల్ ఆఫర్స్ వచ్చాయి. ముందు తమిళ్‌లో మూడు సీరియల్స్ చేశాను. ఇప్పుడు తెలుగులో ‘సావిత్రమ్మగారి అబ్బాయి’ సీరియల్ చేస్తున్నాను. తమిళ్‌లో కూడా ‘సత్య’ అనే సీరియల్ చేస్తున్నాను. అంతకుముందు ఓ తమిళ్ సినిమాలోనూ నటించాను.
ఒప్పించడం చాలా కష్టం
మా అమ్మానాన్న ముందు నేను ‘యాక్టింగ్’ అంటే మరో మాట లేకుండా ‘నో’ అన్నారు. ఇంట్లో అంతా ‘నాట్ గుడ్’ అన్నారు. అందరినీ ఒప్పించడానికి నాకు బాగానే టైమ్ పట్టింది. చివరికి ఇక నా ఆసక్తి గమనించి ‘ఓకే’ చేశారు. ఇప్పుడు అమ్మ, నాన్న చాలా హ్యాపీ. మా రిలేటివ్స్ కూడా ఇప్పుడు నా సీరియల్స్ చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఏ ఎపిసోడ్‌లో బాగున్నాను, ఎలా యాక్ట్ చేస్తున్నాను.. అనే విషయాలు నాకు ఫోన్ ద్వారానో, కలిసినప్పుడో చెబుతారు.
కలర్‌ఫుల్ లైఫ్
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. రోజంతా వర్క్ అంటే నాకు ఇష్టం లేదు. లైఫ్ కలర్‌ఫుల్‌గా, ఎంజాయ్‌గా గడిచిపోవాలని కోరుకుంటాను. నాక్కాబోయే భర్త కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. నేను పూర్తిగా నాన్‌వెజిటేరియన్. ఎలాంటి ఫిట్‌నెస్ జాగ్రత్తలు లేవు. ఏడేళ్లుగా ఇదే ఫిట్‌నెస్‌తో ఉన్నాను. బహుశా ఎక్కడా ఖాళీ లేకుండా, హ్యాపీగా ఉండటం వల్ల ఇప్పుడూ అలాగే ఉన్నాను. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ఈ లైఫ్‌ని ఇలా హ్యాపీగా గడిపేస్తే చాలనుకుంటున్నాను.’’
టైమ్ దొరికితే నిద్ర
చదువుకునే టైమ్‌లో పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం అంటే ఇష్టం ఉండేది. ఇప్పుడు అస్సలు ఖాళీ అస్సలు టైమ్ లేదు. కాస్త ఖాళీ టైమ్ దొరికితే చాలు నిద్రపోతాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు నెలలో ఇరవై రోజులు వర్క్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment