Pak Ayesha Mera Dil Ye Pukare Aaja Song Dance In Mr Bean Version Video Viral - Sakshi
Sakshi News home page

Viral Video: వైరల్‌ అయేషా.. పోటీగా లతాజీ పాటకు మిస్టర్‌ బీన్‌ స్టెప్పులు

Published Sat, Nov 26 2022 7:11 PM | Last Updated on Sat, Nov 26 2022 7:18 PM

Pak Ayesha Mera Dil Ye Pukare Aaja Version Of Mr bean Viral - Sakshi

అయేషా.. గత వారం రోజులుగా ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న పేరు. లతాజీ పాడిన క్లాసిక్‌ సాంగ్‌ ‘మేరా దిల్‌ యే పుకారా ఆజా’ రీమిక్స్‌ వెర్షన్‌కు ఓ వివాహ వేడుకలో ఆ చిన్నది వేసిన చిందులకు యావత్‌ ఇంటర్నెట్‌ ప్రపంచం ఫిదా అయ్యింది. 

పాకిస్థాన్‌ లాహోర్‌కు చెందిన అయేషా.. ఓ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో భారతరత్న లతా మంగేష్కర్‌ ఆలపించిన మేరా దిల్‌ యే పుకారా ఆజా సాంగ్‌ రీమిక్స్‌కు లయబద్ధంగా స్టెప్పులు వేసింది. ఆ వీడియో కాస్త ఇంటర్నెట్‌ను షేక్‌ చేసింది. మన దేశంతో సహా ఎంతో మంది ఆమె స్టెప్పులకు ఫిదా అయిపోయారు. ఓవర్‌ నైట్‌లోనే ఫాలోవర్స్‌ను అమాంతం పెంచేసుకుని ఈ-సెలబ్రిటీ అయిపోయింది అయేషా.  

అయేషా స్ఫూర్తితో ఇన్‌స్టాలో రకరకాల వెర్షన్‌లు వచ్చేశాయి. అంతేకాదు నాగిని(1954) చిత్రంలోని ఒరిజినల్‌ పాట కోసం, లతాజీ గాత్రం కోసం ఎంతో మందిని వెతుక్కునేలా చేసింది.

మరోవైపు ఫన్నీగా, క్రియేటివ్‌గా రీల్స్‌ రూపొందించే యత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చిందే మిస్టర్‌ బీన్‌ వెర్షన్‌. మిస్టర్‌ బీన్‌స్‌ హాలీడే చిత్రంలో రోవన్‌ అట్కిన్సన్‌ ఓ సీన్‌లో ఆయన డ్యాన్స్‌ చేస్తారు. ఆ వీడియోను..  మేరా దిల్‌ యే పుకారా ఆజాకు ముడిపెట్టిన ఫన్నీ రీల్‌ క్రియేట్‌ చేశారు. ఆ ఫన్నీ వెర్షన్‌తో పాటు అయేషా వెర్షన్‌పైనా ఓ లుక్కేయండి మరి!.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement