Mr Bean
-
లతా మంగేష్కర్ పాటకు మిస్టర్ బీన్ స్టెప్పులు
అయేషా.. గత వారం రోజులుగా ఇంటర్నెట్ను ఊపేస్తున్న పేరు. లతాజీ పాడిన క్లాసిక్ సాంగ్ ‘మేరా దిల్ యే పుకారా ఆజా’ రీమిక్స్ వెర్షన్‌కు ఓ వివాహ వేడుకలో ఆ చిన్నది వేసిన చిందులకు యావత్ ఇంటర్నెట్ ప్రపంచం ఫిదా అయ్యింది. పాకిస్థాన్ లాహోర్‌కు చెందిన అయేషా.. ఓ వెడ్డింగ్ రిసెప్షన్లో భారతరత్న లతా మంగేష్కర్ ఆలపించిన మేరా దిల్ యే పుకారా ఆజా సాంగ్ రీమిక్స్‌కు లయబద్ధంగా స్టెప్పులు వేసింది. ఆ వీడియో కాస్త ఇంటర్నెట్ను షేక్ చేసింది. మన దేశంతో సహా ఎంతో మంది ఆమె స్టెప్పులకు ఫిదా అయిపోయారు. ఓవర్ నైట్‌లోనే ఫాలోవర్స్‌ను అమాంతం పెంచేసుకుని ఈ-సెలబ్రిటీ అయిపోయింది అయేషా. అయేషా స్ఫూర్తితో ఇన్‌స్టాలో రకరకాల వెర్షన్లు వచ్చేశాయి. అంతేకాదు నాగిని(1954) చిత్రంలోని ఒరిజినల్ పాట కోసం, లతాజీ గాత్రం కోసం ఎంతో మందిని వెతుక్కునేలా చేసింది. మరోవైపు ఫన్నీగా, క్రియేటివ్‌గా రీల్స్ రూపొందించే యత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చిందే మిస్టర్ బీన్ వెర్షన్. మిస్టర్ బీన్స్ హాలీడే చిత్రంలో రోవన్ అట్కిన్సన్ ఓ సీన్లో ఆయన డ్యాన్స్ చేస్తారు. ఆ వీడియోను.. మేరా దిల్ యే పుకారా ఆజాకు ముడిపెట్టిన ఫన్నీ రీల్ క్రియేట్ చేశారు. ఆ ఫన్నీ వెర్షన్‌తో పాటు అయేషా వెర్షన్‌పైనా ఓ లుక్కేయండి మరి!. View this post on Instagram A post shared by 𝐅𝐑𝐊 𝐌𝐀𝐆𝐀𝐙𝐈𝐍𝐄 𝐏𝐀𝐊𝐈𝐒𝐓𝐀𝐍 (@frk.magazine) -
పాక్ గడ్డ మీద పుట్టి పాక్‌నే ఓడించాడు! ‘ఈసారైనా మోసం చేయకండి’! ఈ మిస్టర్ బీన్ గోలేంటి?
T20 WC 2022- Pakistan vs Zimbabwe- Who is the fake Pak Mr Bean: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు జింబాబ్వే జట్టును హీరోను చేస్తే.. పాకిస్తాన్‌ను జీరో చేసింది. బాబర్ ఆజం బృందానికి ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ప్రపంచకప్-2022లో భాగంగా సూపర్-12లో ఒక్క పరుగు తేడాతో పాక్‌ను ఓడించి జింబాబ్వే సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా బ్యాటర్‌గా విఫలమైనా(9 పరుగులు) బౌలింగ్‌తో మ్యాజిక్ చేసి తమ జట్టును గెలిపించాడు. పాక్ గడ్డ మీద పుట్టి పాక్‌నే ఓడించి పెర్త్ మ్యాచ్‌లో 4 ఓవర్ల బౌలింగ్ చేసిన ఈ రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్.. కీలక సమయంలో వికెట్లు తీశాడు. మొత్తంగా 25 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. పాక్ గడ్డ మీద పుట్టిన ఈ ఆల్‌రౌండర్.. పాక్‌తో పోరులో జింబాబ్వేను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక జింబాబ్వే చేతిలో ఓటమితో పాకిస్తాన్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. సెమీస్ అవకాశాలపై ఈ పరాజయం కచ్చితంగా ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. నాడు పాక్ మోసం చేసిందంటూ జింబాబ్వే ప్రెసిడెంట్ ట్వీట్! ఇదిలా ఉంటే.. ప్రపంచకప్-2022 సూపర్-12లో జింబాబ్వే తొలి విజయంతో ఆ దేశ అధ్యక్షుడు ఎమర్సన్ డేంబజో మినాంగాగ్వ పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘జింబాబ్వే అద్భుత విజయం! జట్టుకు శుభాకాంక్షలు. నెక్ట్స్ టైమ్ నిజమైన మిస్టర్ బీన్‌ను పంపండి’’ అని పేర్కొన్నారు. తమ జట్టును అభినందిస్తూనే పాక్ తీరుపై సెటైర్లు వేశారు. గతంలో తమ ప్రజలను మోసం చేసే విధంగా పాక్ వ్యవహరించిందన్న అర్థం వచ్చేలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలేం జరిగిందంటే.. నూరుద్దియన్ అనే ట్విటర్ యూజర్ జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు పాక్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు షేర్ చేస్తూ.. ప్రతీకార మ్యాచ్ అవుతుందనుకోవడం లేదంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు స్పందనగా.. నుగుగి చాసురా అనే నెటిజన్.. ‘‘జింబాబ్వే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మిస్టర్‌బీన్ రోవాన్ బదులు పాక్ నకిలీ బీన్‌ను మా దగ్గరికి పంపించారు. ఈ మ్యాటర్‌ను రేపటి మ్యాచ్‌లో తేలుస్తాం. వర్షం మిమ్మల్ని కాపాడాలని ప్రార్థించుకోండి’’ అంటూ కామెంట్ చేశాడు. ఇందుకు జతగా మిస్టర్ బీన్ డూప్‌తో ఇద్దరు వ్యక్తులు ఫొటోలకు పోజులిస్తున్న దృశ్యాన్ని షేర్ చేశాడు. Blimey. I didn't realise Pakistan vs Zimbabwe was a grudge match and for good reason pic.twitter.com/wtllENSZnl — Nooruddean (@BeardedGenius) October 26, 2022 అసలేం జరిగిందంటూ ఓ పాకిస్తానీ ఫ్యాన్ అడుగగా.. సదరు నెటిజన్.. ‘‘వాళ్లు మాకు మిస్టర్ బీన్ బదులు నకిలీ మిస్టర్ బీన్ ఇచ్చారు. స్థానికంగా జరిగే అగ్రికల్చరల్ షోకు అతడిని పంపించారు’’ అని వివరణ ఇచ్చాడు. ‘‘ఈ పాక్ బీన్.. ప్రజలను మోసం చేస్తూ వారి డబ్బును దోచుకుంటాడు’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ దీంతో ఈ నకిలీ బీన్ వ్యవహారమేమిటంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో పాక్‌పై జింబాబ్వే గెలుపొందడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. మిస్టర్ బీన్ డూప్‌లా ఉన్న ఆ వ్యక్తి పేరు ఆసిఫ్ ముహ్మద్గా కొంతమంది పేర్కొన్నారు. అతడు పాకిస్తానీ కమెడియన్. ఒకానొక సందర్భంలో అతడు జింబాబ్వే షోలో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో పలు వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. Here is the footage of Pakistani, Mr. Bean in Zimbabwe. The controversy is getting out of hands 🤣pic.twitter.com/BW3oc3oZbm — Shafqat Shabbir (@Chefkat23) October 26, 2022 2016లో హరారేలో ఓ కామెడీ షోలో రియల్ మిస్టర్ బీన్‌ను చూడటానికి 10 డాలర్లు చెల్లించి.. ప్రజలు ఎదురుచూడగా.. ఆసిఫ్ రావడంతో వారు కంగుతిన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే జింబాబ్వే ప్రెసిడెంట్ ఎమర్సన్ ట్వీట్ చేశారు. ఇక ఇందుకు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కాస్త ఘాటుగానే స్పందించారు. ఘాటు స్పందన ‘‘మా దగ్గర నిజమైన మిస్టర్ బీన్ లేకపోవచ్చు. కానీ ఆటలో క్రీడా స్ఫూర్తి కనబరచ గల పరిణతి ఉంది... మా పాకీస్తానీలకు వెంటనే తిరిగి పుంజుకునే సరదా కూడా ఉంది! మిస్టర్ ప్రెసిడెంట్ మీకు శుభాకాంక్షలు. నిజంగా ఈ రోజు మీ జట్టు చాలా బాగా ఆడింది’’ అని ట్వీట్ చేశారు. We may not have the real Mr Bean, but we have real cricketing spirit .. and we Pakistanis have a funny habit of bouncing back :) Mr President: Congratulations. Your team played really well today. 👏 https://t.co/oKhzEvU972 — Shehbaz Sharif (@CMShehbaz) October 27, 2022 మిస్టర్ బీన్ ఎవరు? మిస్టర్ బీన్‌గా కోట్లాది మందిని అలరిస్తున్న రోవాన్ సెబాస్టియన్ అట్కిన్సన్ ఇంగ్లిష్ నటుడు. కమెడియన్‌గా.. రైటర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. ఆయన ముఖం చూస్తే చాలు నవ్వాపుకోవడం ఎవరితరం కాదు! చదవండి: Ind Vs Ned: నాటి వరల్డ్‌కప్‌లో తండ్రి సచిన్ వంటి దిగ్గజాల వికెట్లు తీసి.. నేడు కొడుకు మాత్రం.. T 20 WC: 'బాబర్ ఒక పనికిరాని కెప్టెన్.. ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి' -
మిస్టర్ బీన్ మరణించినట్లు ప్రచారం.. ఫ్యాన్స్ ఫైర్
Mr Bean Aka Rowan Atkinson Is Rumored To Be Dead And Goes Viral: ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువైపోయింది. అందులో ఎన్నో వార్తలు చక్కర్లు కొడతాయి. ఆ వార్తలు సమాచారం అందించేలా ఉన్నా, కొన్నిసార్లు తప్పుడు వార్తలే ఎక్కువ ప్రచారం అవుతుంటాయి. ఉదాహరణకి సెలబ్రిటీల విడాకులు, మరణాలు, వింత సంఘటనలు అంటూ పలు పోస్ట్‌లు వైరల్ అవుతుంటాయి. ఈ పుకార్లకు బాధితులైనవారు స్పందించకుండా ఉండలేరు. ఇక మరణించినట్లు వచ్చిన వార్తలపై అయితే వారు 'మేము బతికే ఉన్నాం' అని చెప్పినా సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. పరిచయం అక్కర్లేని పేరు మిస్టర్ బీన్. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను గెలుచుకున్నారు. ఆయన అసలు పేరు రోవన్ అట్కిన్సన్. ఆయన పోషించిన పాత్ర పేరు 'మిస్టర్ బీన్'. ఈ పాత్ర తొలిసారిగా 1990లో పరిచయం అయింది. దీని తర్వాత క్రమంగా ప్రపంచవ్యాప్తంగా పాపులరైంది. అప్పటినుంచి రోవన్ అట్కిన్సన్ను అందరూ మిస్టర్ బీన్ అనే పిలిచేవారు. అయితే ఇటీవల ఈ బ్రిటీష్ నటుడు ఇక లేరంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. రోవాన్ చనిపోయాడంటూ ఓ ప్రసిద్ధ ఇంటర్నేషనల్ న్యూస్ చానల్ ప్రసారం కూడా చేసింది. ఈ వార్త చూసిన రోవన్ అభిమానులు కలత చెందారు. ఆయన చనిపోయాడని నిజంగానే భావించి కొంతమంది రిప్ (RIP) మిస్టర్ బీన్ అని పోస్ట్‌లు కూడా పెట్టారు. తర్వాత ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తెలిసి ఫైర్ అయ్యారు. 'ఫాక్స్ న్యూస్' తన ట్విటర్ అకౌంట్లో ‘ఫాక్స్ బ్రేకింగ్ న్యూస్ – మిస్టర్ బీన్ (రోవన్ అట్కిన్సన్) 58 సంవత్సరాల వయసులో కారు ప్రమాదంలో మరణించారు’ అంటూ లింక్‌పై క్లిక్ చేయండి అని పోస్ట్ చేసింది. తప్పుడు వార్తని ప్రచారం చేసినందుకు అంతర్జాతీయంగా ఉన్న రోవన్ అభిమానులు ఆ న్యూస్ ఛానల్‌పై మండిపడ్డారు. అయితే రోవన్ అట్కిన్సన్ మరణించినట్లు వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. మిస్టర్ బీన్ 18 మార్చి 2017న రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు ఇంతకు ముందు కూడా వార్తలు రాగా ఆయన బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రోవన్ ప్రముఖ హాలీవుడ్ సిరీస్ ‘పీకీ బ్లైండర్స్’లో హిట్లర్ పాత్రను పోషించబోతున్నాడు. -
62 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రవుతున్నాడు
మిస్టర్ బీన్ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు రోవన్ అట్కీన్సన్. 62 ఏళ్ల ఈ హాలీవుడ్ నటుడు త్వరలో మూడో సారి తండ్రికాబోతున్నాడు. మొదటి భార్యతో ఇద్దరు పిల్లలున్న రోవన్, ప్రస్తుతం 33 ఏళ్ల లూయిస్ ఫోర్డ్ తో సహజీవనం చేస్తున్నారు. గత ఆదివారం నార్త్ లండన్ లోని ఓ షాపింగ్ మాల్ లో లూయిస్ కనిపించడటం ఆమె గర్బవతి అన్న విషయం ప్రపంచానికి తెలిసింది. అయితే ఈ విషయంపై రోవన్, లూయిస్ లు ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. రోవన్ కు ఇప్పటికే 25 ఏళ్ల కుమారుడు, 21 ఏళ్ల కూతురు ఉన్నారు. -
మిస్టర్ బీన్‌కు భార్య విడాకులు!
'వింత ప్రవర్తన' కారణంగా మిస్టర్ బీన్ స్టార్ రోవన్ అట్కిన్సన్కు ఆయన భార్య విడాకులు ఇచ్చింది. 60 ఏళ్ల అట్కిన్సన్ గత కొంతకాలంగా తనకన్నా 24 ఏళ్లు చిన్నదైన ఓ కామెడీ నటితో ప్రేమాయణం సాగిస్తూ భార్య సునెట్రాకు దూరంగా ఉంటున్నాడు. మేకప్ ఆర్టిస్ట్ అయిన సునెట్రాను 1990లో అట్కిన్సన్ వివాహం చేసుకున్నాడు. అయితే గత 18 నెలలుగా 32 ఏళ్ల లూయిస్ ఫోర్డ్‌తో డేటింగ్ చేస్తుండటంతో భార్యను విడిచిపెట్టాడు. అర్థంలేని కారణాలతో తనకు దూరంగా ఉంటున్న అట్కిన్సన్ నుంచి తనకు విడాకులు ఇవ్వాల్సిందిగా సునెట్రా కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో లండన్ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. వింత చేష్టలు చేసే మిస్టర్ బీన్ పాత్ర పోషించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అట్కిన్సన్ పేరుప్రఖ్యాతలు సంపాదించిన సంగతి తెలిసిందే.