62 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రవుతున్నాడు | Rowan Atkinson to become dad for third time | Sakshi
Sakshi News home page

62 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రవుతున్నాడు

Published Wed, Nov 15 2017 1:36 PM | Last Updated on Wed, Nov 15 2017 1:36 PM

Rowan Atkinson to become dad for third time  - Sakshi

మిస్టర్ బీన్ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు రోవన్ అట్కీన్సన్. 62 ఏళ్ల ఈ హాలీవుడ్ నటుడు త్వరలో మూడో సారి తండ్రికాబోతున్నాడు. మొదటి భార్యతో ఇద్దరు పిల్లలున్న రోవన్, ప్రస్తుతం 33 ఏళ్ల లూయిస్ ఫోర్డ్ తో సహజీవనం చేస్తున్నారు. గత ఆదివారం నార్త్ లండన్ లోని ఓ షాపింగ్ మాల్ లో లూయిస్ కనిపించడటం ఆమె గర్బవతి అన్న విషయం ప్రపంచానికి తెలిసింది. అయితే ఈ విషయంపై రోవన్, లూయిస్ లు ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. రోవన్ కు ఇప్పటికే 25 ఏళ్ల కుమారుడు, 21 ఏళ్ల కూతురు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement