Rowan Atkinson
-
మిస్టర్ బీన్ మరణించినట్లు ప్రచారం.. ఫ్యాన్స్ ఫైర్
Mr Bean Aka Rowan Atkinson Is Rumored To Be Dead And Goes Viral: ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువైపోయింది. అందులో ఎన్నో వార్తలు చక్కర్లు కొడతాయి. ఆ వార్తలు సమాచారం అందించేలా ఉన్నా, కొన్నిసార్లు తప్పుడు వార్తలే ఎక్కువ ప్రచారం అవుతుంటాయి. ఉదాహరణకి సెలబ్రిటీల విడాకులు, మరణాలు, వింత సంఘటనలు అంటూ పలు పోస్ట్‌లు వైరల్ అవుతుంటాయి. ఈ పుకార్లకు బాధితులైనవారు స్పందించకుండా ఉండలేరు. ఇక మరణించినట్లు వచ్చిన వార్తలపై అయితే వారు 'మేము బతికే ఉన్నాం' అని చెప్పినా సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. పరిచయం అక్కర్లేని పేరు మిస్టర్ బీన్. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను గెలుచుకున్నారు. ఆయన అసలు పేరు రోవన్ అట్కిన్సన్. ఆయన పోషించిన పాత్ర పేరు 'మిస్టర్ బీన్'. ఈ పాత్ర తొలిసారిగా 1990లో పరిచయం అయింది. దీని తర్వాత క్రమంగా ప్రపంచవ్యాప్తంగా పాపులరైంది. అప్పటినుంచి రోవన్ అట్కిన్సన్ను అందరూ మిస్టర్ బీన్ అనే పిలిచేవారు. అయితే ఇటీవల ఈ బ్రిటీష్ నటుడు ఇక లేరంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. రోవాన్ చనిపోయాడంటూ ఓ ప్రసిద్ధ ఇంటర్నేషనల్ న్యూస్ చానల్ ప్రసారం కూడా చేసింది. ఈ వార్త చూసిన రోవన్ అభిమానులు కలత చెందారు. ఆయన చనిపోయాడని నిజంగానే భావించి కొంతమంది రిప్ (RIP) మిస్టర్ బీన్ అని పోస్ట్‌లు కూడా పెట్టారు. తర్వాత ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తెలిసి ఫైర్ అయ్యారు. 'ఫాక్స్ న్యూస్' తన ట్విటర్ అకౌంట్లో ‘ఫాక్స్ బ్రేకింగ్ న్యూస్ – మిస్టర్ బీన్ (రోవన్ అట్కిన్సన్) 58 సంవత్సరాల వయసులో కారు ప్రమాదంలో మరణించారు’ అంటూ లింక్‌పై క్లిక్ చేయండి అని పోస్ట్ చేసింది. తప్పుడు వార్తని ప్రచారం చేసినందుకు అంతర్జాతీయంగా ఉన్న రోవన్ అభిమానులు ఆ న్యూస్ ఛానల్‌పై మండిపడ్డారు. అయితే రోవన్ అట్కిన్సన్ మరణించినట్లు వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. మిస్టర్ బీన్ 18 మార్చి 2017న రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు ఇంతకు ముందు కూడా వార్తలు రాగా ఆయన బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రోవన్ ప్రముఖ హాలీవుడ్ సిరీస్ ‘పీకీ బ్లైండర్స్’లో హిట్లర్ పాత్రను పోషించబోతున్నాడు. -
ఆ నవ్వుల రారాజు నిక్షేపంగా ఉన్నాడు
డైలాగులు లేకుండా స్లాప్స్టిక్ కామెడీ(ఫిజికల్ మూమెంట్స్), తన మైమ్ యాక్టింగ్‌తో నవ్వులు పండించి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు నటుడు రోవాన్ ఎట్కిన్సన్. తన మెస్మమరైజింగ్ యాక్టింగ్‌తో మిస్టర్ బీన్ క్యారెక్టర్‌ను ఒక ఐకానిక్ క్యారెక్టర్‌గా తీర్చిదిద్దడంతో పాటు నవ్వుల రారాజు ట్యాగ్ లైన్ దక్కించుకున్నాడు. అలాంటి రోవాన్ చనిపోయాడంటూ ఓ వార్త ఫేస్బుక్లో.. అది కూడా మిస్టర్ బీన్ ఫేస్బుక్ పేజీ నుంచే విపరీతంగా షేర్ అయ్యింది. బ్రిటిష్ యాక్టర్ రోవాన్ ఎట్కిన్సన్ అలియాస్ మిస్టర్ బీన్ చనిపోయాడంటూ మే 29న వార్త ఫేస్బుక్లో స్ప్రెడ్ అయ్యింది. అది మిస్టర్‌బీన్ ఫేస్బుక్ పేజీ కావడంతో ఆ వార్తను వేల మంది షేర్ చేస్తారు. తీరా ఆరా తీస్తే తేలింది ఏంటంటే.. అది బోగస్ పేజీ అని. చాలాకాలం నుంచి రన్ అవుతుండడంతో ఆ పేజీని చాలామంది ఫాలో అవుతున్నారు. ఇక ఈ వార్త, ఆ పేజీ ఫేక్ అని తెలియగానే ఆ పోస్ట్‌పై కొందరు తిడుతూ కామెంట్లు పెట్టారు. దీంతో ఆ పేజీ నిర్వాహకులు ఆ పోస్ట్‌ను పేజీ నుంచి డిలీట్ చేశారు. కాగా, నైంటీస్‌లో మిస్టర్ బీన్ క్యారెక్టర్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు ఎట్కిన్సన్. పోగో ఛానెల్ ద్వారా మిస్టర్ బీన్ మన టీవీ ఆడియొన్స్‌కు రీచ్ అయ్యింది కూడా. 66 ఏళ్ల రోవాన్ చనిపోయాడంటూ వార్తలు రావడం ఇదేం కొత్త కాదు కూడా. 2012, 2013, 2015, 2016, 2017, 2018.. ఇక ఇప్పుడు ఆయన చావుపై ఫేక్ న్యూస్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది కూడా. కాగా, రోవాన్ ఎట్కిన్సన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఇద్దరూ క్లాస్మేట్స్ కూడా. మరిన్ని హాలీవుడ్ వార్తల కోసం క్లిక్ చేయండి -
62 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రవుతున్నాడు
మిస్టర్ బీన్ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు రోవన్ అట్కీన్సన్. 62 ఏళ్ల ఈ హాలీవుడ్ నటుడు త్వరలో మూడో సారి తండ్రికాబోతున్నాడు. మొదటి భార్యతో ఇద్దరు పిల్లలున్న రోవన్, ప్రస్తుతం 33 ఏళ్ల లూయిస్ ఫోర్డ్ తో సహజీవనం చేస్తున్నారు. గత ఆదివారం నార్త్ లండన్ లోని ఓ షాపింగ్ మాల్ లో లూయిస్ కనిపించడటం ఆమె గర్బవతి అన్న విషయం ప్రపంచానికి తెలిసింది. అయితే ఈ విషయంపై రోవన్, లూయిస్ లు ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. రోవన్ కు ఇప్పటికే 25 ఏళ్ల కుమారుడు, 21 ఏళ్ల కూతురు ఉన్నారు. -
మిస్టర్ బీన్‌కు భార్య విడాకులు!
'వింత ప్రవర్తన' కారణంగా మిస్టర్ బీన్ స్టార్ రోవన్ అట్కిన్సన్కు ఆయన భార్య విడాకులు ఇచ్చింది. 60 ఏళ్ల అట్కిన్సన్ గత కొంతకాలంగా తనకన్నా 24 ఏళ్లు చిన్నదైన ఓ కామెడీ నటితో ప్రేమాయణం సాగిస్తూ భార్య సునెట్రాకు దూరంగా ఉంటున్నాడు. మేకప్ ఆర్టిస్ట్ అయిన సునెట్రాను 1990లో అట్కిన్సన్ వివాహం చేసుకున్నాడు. అయితే గత 18 నెలలుగా 32 ఏళ్ల లూయిస్ ఫోర్డ్‌తో డేటింగ్ చేస్తుండటంతో భార్యను విడిచిపెట్టాడు. అర్థంలేని కారణాలతో తనకు దూరంగా ఉంటున్న అట్కిన్సన్ నుంచి తనకు విడాకులు ఇవ్వాల్సిందిగా సునెట్రా కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో లండన్ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. వింత చేష్టలు చేసే మిస్టర్ బీన్ పాత్ర పోషించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అట్కిన్సన్ పేరుప్రఖ్యాతలు సంపాదించిన సంగతి తెలిసిందే.