ఆ నవ్వుల రారాజు నిక్షేపంగా ఉన్నాడు | Death Hoax On Mr Bean, This Time Fake Facebook | Sakshi
Sakshi News home page

మిస్టర్​ బీన్​ ఫేస్​బుక్​ పేజీలోనే చావు కబురు, కట్ చేస్తే..

Published Sun, Jun 6 2021 8:03 AM | Last Updated on Sun, Jun 6 2021 11:02 AM

Death Hoax On Mr Bean, This Time Fake Facebook - Sakshi

డైలాగులు లేకుండా స్లాప్​స్టిక్​ కామెడీ​(ఫిజికల్​ మూమెంట్స్​), తన మైమ్​ యాక్టింగ్​తో నవ్వులు పండించి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు నటుడు రోవాన్​ ఎట్కిన్​సన్​. తన మెస్మమరైజింగ్ యాక్టింగ్​తో మిస్టర్​ బీన్​ క్యారెక్టర్​ను ఒక ఐకానిక్​ క్యారెక్టర్​గా తీర్చిదిద్దడంతో పాటు నవ్వుల రారాజు ట్యాగ్​ లైన్​ దక్కించుకున్నాడు. అలాంటి రోవాన్​ చనిపోయాడంటూ ఓ వార్త ఫేస్​బుక్​లో.. అది కూడా మిస్టర్​ బీన్​ ఫేస్​బుక్​ పేజీ నుంచే విపరీతంగా షేర్​ అయ్యింది. 

బ్రిటిష్ యాక్టర్ రోవాన్​ ఎట్కిన్​సన్​ అలియాస్​ మిస్టర్ బీన్ చనిపోయాడంటూ మే 29న వార్త ఫేస్​బుక్​లో స్ప్రెడ్ అయ్యింది. అది మిస్టర్​బీన్ ఫేస్​బుక్​ పేజీ కావడంతో ఆ వార్తను వేల మంది షేర్​ చేస్తారు. తీరా ఆరా తీస్తే తేలింది ఏంటంటే.. అది బోగస్​ పేజీ అని. చాలాకాలం నుంచి రన్​ అవుతుండడంతో ఆ పేజీని చాలామంది ఫాలో అవుతున్నారు. ఇక ఈ వార్త, ఆ పేజీ ఫేక్ అని తెలియగానే​ ఆ పోస్ట్​పై కొందరు తిడుతూ కామెంట్లు పెట్టారు. దీంతో ఆ పేజీ నిర్వాహకులు ఆ పోస్ట్​ను పేజీ నుంచి డిలీట్​ చేశారు.

కాగా, నైంటీస్​లో మిస్టర్ బీన్ క్యారెక్టర్​తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు ఎట్కిన్​సన్​. పోగో ఛానెల్ ద్వారా మిస్టర్​ బీన్​ మన టీవీ ఆడియొన్స్​కు రీచ్​ అయ్యింది కూడా. 66 ఏళ్ల రోవాన్​ చనిపోయాడంటూ వార్తలు రావడం ఇదేం కొత్త కాదు కూడా. 2012, 2013, 2015, 2016, 2017, 2018.. ఇక ఇప్పుడు ఆయన చావుపై ఫేక్​ న్యూస్​ ఇంటర్నెట్​లో వైరల్ అయ్యింది కూడా. ​ కాగా, రోవాన్​ ఎట్కిన్​సన్, బ్రిటన్​ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్​ ఇద్దరూ క్లాస్​మేట్స్​ కూడా.

మరిన్ని హాలీవుడ్ వార్తల కోసం క్లిక్​ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement