హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ ఖాజీపురాలో బుధవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో అంజాద్ అనే యువకుడు ప్రియురాలిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనలో ప్రియురాలు అయేషా తీవ్రంగా గాయపడింది. కూతురుపై జరుగుతున్న దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తల్లిదండ్రులపై సైతం అంజాద్ దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు శాలిబండ పోలీసులు అంజాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై నిర్భయ, హత్యాయత్నం కేసులు నమోదుచేశారు.