ప్రేయసి ఆలస్యానికి కూతురు హత్య | Angry at girlfriend coming home late, man kills daughter | Sakshi
Sakshi News home page

ప్రేయసి ఆలస్యానికి కూతురు హత్య

Published Thu, Mar 12 2015 8:55 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

Angry at girlfriend coming home late, man kills daughter

ముంబై: ప్రేయసిపై కోపంతో కూతురును హత్య చేశాడో తండ్రి. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. అయితే, చంపబడిన పాప వారిద్దరికి జన్మించినమ్మాయే. విపుల్ మెహతా(39), నగ్మా షేక్(24) అనే ఇద్దరు కొన్నేళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్నారు. వీరిద్దరికి పియా(5) అనే ఓ పాప జన్మించింది. గత కొంతకాలంగా నగ్మా షేక్ ఇంటికి ఆలస్యంగా వస్తోందని విపుల్ మెహతా గొడవపడుతున్నాడు.

 

విపుల్ హెచ్చరించినప్పటికీ బుధవారం తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిన నగ్మా గురువారం తెల్లవారే వరకు కూడా రాలేదు. అతడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తిరిగి సమాధానం ఇవ్వలేదు. దీంతో మధ్యపానం సేవించిన విపుల్ ఇంట్లో ఉన్న పాప పియా గొంతునులిమేశాడు. ఈ సమయంలో పాప గట్టిగా కేకలు వేయగా చుట్టుపక్కల వారు పోలీసులకు చెప్పారు. ఈలోపే విపుల్ కూడా పురుగుల మందు తాగాడు. నగ్మా వచ్చి పాపను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయింది. విపుల్ ఆస్పత్రిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement