దేశ ఆర్థిక రాజధాని ముంబైలో హింస వాతావరణం నెలకొంది. దళితులు, మరాఠాల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. ఈ గొడవలో ఒకరు మృతిచెందగా, పలువరికి గాయాలయ్యాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు ముంబై, పుణె, ఔరంగాబాద్‌లో జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. వారి ఆగ్రహజ్వాలలకు పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి.