క్లబ్స్, పబ్స్, కేఫ్స్, ఈవెంట్స్‌లో డీజేలుగా సందడి
తెలుగు అమ్మాయిలు సైతం రంగంలోకి
నగరంలో కదం తొక్కిస్తున్న యువతులు
యువకుల ఆధిపత్యానికి బ్రేక్స్..
అర్ధరాత్రి సమయం..చిమ్మ చీకట్లని. పట్ట పగలుగా మార్చే రంగురంగుల విద్యుత్ కాంతుల్లో.. ఓ వైపు ఛీర్స్‌తో హుషారు.. మరోవైపు చిందుల జోరు.. ఆ సమయంలో తోడు లేకుండా అమ్మాయిలు బయటకు వెళ్లడమే సరికాదని నొక్కి వక్కాణించే సంప్రదాయ వాదుల చెవులకు చిల్లులు పడే సంగీతంతో కదం తొక్కుతున్నారు ఆధునిక యువతులు. డీజేలుగా.. మేల్ డామినేషన్‌కు గండికొడుతూ శరవేగంగా ముందుకు దూసుకొస్తున్నారు.
‘మనసుకు నచ్చిన సంగీతం.. వయసుకు తగ్గ వినోదం.. మంచి ఫ్రెండ్స్. ఇన్ని అందించే రంగాన్ని వదిలేసి సాదా సీదా ఉద్యోగం ఎందుకు చేయాలి?’ అని ప్రశ్నింస్తున్నారు అఖిల. ఉద్యోగం అంటే మంచి ఆదాయం వస్తుంది కదా..అంటే..! ‘నేను ఎంచుకున్న కెరీర్‌లో అంతకన్నా ఎక్కువ సంపాదనే ఇప్పుడు వస్తుంది’ అంటూ స్పష్టం చేశారు. సాయంత్రం ఆరు దాకా అఖిల.. ఆరు దాటాక డీజే బ్లాక్.
ఎవరూ డేర్ చేయని రోజుల్లోనే..
దాదాపు పదేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చారు లీనా. నగరంలోని సికింద్రాబాద్‌లో నివసించే ఈ సింథీ యువతి.. డిగ్రీ పూర్తి చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కూడా చేశారు. అనంతరం కొన్ని షోస్ చేశారు.. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఆ తర్వాత ఫుల్‌టైమ్ డీజేయింగ్‌ను ఎంచుకున్నారు. ‘ఏవీ మనసుకు నచ్చలేదు. అదే నా కెరీర్‌ను ఇటు మార్చింది’ అంటూ చెప్పారు డీజే లీనా. ఫ్రీలాన్స్ డీజేగా సిటీలోని సగం పైగా క్లబ్స్‌లో ఇప్పటికే తన మ్యూజిక్ వినిపించానంటున్న లీనా.. బాలీవుడ్ అంటే తనకు ప్రేమ అనీ, అందుకే ఆ సంగీతాన్ని ప్లే చేయడానికి తాను ఇష్టపడతానని అంటున్నారు. అమ్మాయిలు ఈ రంగంలోకి ఎక్కువగా రాకపోవడానికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు దొరకకపోవడమే కారణమంటున్నారు లీనా.. తాను కూడా అతి కష్టం మీద కుటుంబ సభ్యులను ఒప్పించగలిగానని చెబుతున్నారు.
ట్రెడిషనల్ ఫ్యామిలీలో.. ట్రెండీగా..
‘నేను ఇక్ఫాయ్‌లో బీబీఏ పూర్తి చేశాను. సొంతంగా బిజినెస్ చేయాలనేది నా ఆలోచన. అయితే చిన్నప్పటి నుంచీ డీజేయింగ్ అంటే ఇష్టం. ఫ్రెండ్స్‌తో క్లబ్స్‌కి వెళ్లినప్పుడు కేవలం డీజే మ్యూజిక్ కోసమే వెళ్లేదాన్ని’ అంటూ గుర్తు చేసుకున్నారు అఖిల. మహబూబ్ నగర్‌కు చెందిన ఓ పూర్తి సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అఖిల.. 2018లో డీజే స్కూల్‌లో చేరాలని నిర్ణయించున్నారు. అప్పుడు ఇంట్లో వాళ్ల నుంచి చెప్పుకోదగ్గ ప్రతిఘటననే ఎదుర్కొన్నారు. ‘ఫ్యామిలీ వద్దు అన్నప్పటికీ మనసు మాటే విన్నాను. ఒక ప్రోగ్రామ్‌కి కేవలం రూ.1000తో ప్రారంభించి.. ఇప్పుడు అంతకు పదింతలు తీసుకునే స్థాయికి చేరాను’ అంటూ సగర్వంగా చెప్పారామె. అమ్మాయిల భద్రత విషయం గురించి మాట్లాడినప్పుడు.. ‘మా చుట్టూ బౌన్సర్స్ ఉంటారు. ఇప్పటిదాకా చిన్న చేదు అనుభవం కూడా నాకు ఎదురుకాలేదు’ అంటూ చెప్పారామె. భవిష్యత్తులోనూ డీజేగా కొనసాగుతానని, మరిన్ని టాప్ క్లబ్స్‌లో తన మ్యూజిక్‌ని వినిపిస్తానని బాలీవుడ్ ట్య్రాక్స్‌కి పేరొందిన ఈ డీజే బ్లాక్ చెబుతున్నారు.
‘ఫ్లో లో.. ‘జో’రుగా..
‘మా నాన్న వాళ్లది వరంగల్. అయితే నేను నార్త్‌లోనే పెరిగాను. ప్రస్తుతం సిటీలో సెటిలయ్యా’ అంటూ చెప్పారు ఫ్లోజో. డిగ్రీ పూర్తి చేశాక.. కొన్ని కార్పొరేట్ ఉద్యోగాలు చేశా. అయితే చిన్నప్పటి నుంచీ సంగీతం పై ఉన్న ఇష్టంతో డీజేసూ్కల్‌లో చేరి కోర్సు పూర్తి చేసి డీజేగా మారాను అంటూ చెప్పారు ఫ్లోజో. ప్రస్తుతం నగరంలో టాప్ డీజేల్లో ఒకరుగా ఉన్న ఈ అమ్మాయి తొలుత లిక్విడ్స్‌లో రెసిడెంట్ డీజేగా ప్లే చేశానని, కొంత కాలం తర్వాత ఫ్రీలాన్స్ డీజేగా మారి, పలు అవార్డ్స్ కూడా అందుకున్నానని వివరించారు. థాయ్‌ల్యాండ్ వంటి అంతర్జాతీయ వేదికలపైనా, గోవా వంటి పార్టీ సిటీల్లోనూ ప్లే చేశానంటున్న ఫ్లోజోకి తన పేరు స్టైలి‹Ùగా ఉండడంతో మార్చుకోవాల్సిన అవసరం రాలేదన్నారు. ఈ కెరీర్‌లో అటు ఆనందం, ఇటు ఆదాయం రెండూ బాగుంటాయంటున్న ఫ్లోజో.. ఆరేడేళ్లలోనే కారు, ఫ్లాట్ కొనగలిగానని సంతోషంగా చెప్పారు.
ఇదీ చదవండి: గేలి చేసినచోటే గెలిచి చూపించిన మగువలు!
Comments
Please login to add a commentAdd a comment