Rajiv gauba
-
ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. శుక్రవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో అయిదు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. హోం, న్యాయ, గిరిజన సంక్షేమ, సామాజిక న్యాయం, సిబ్బంది, శిక్షణ శాఖల కార్యదర్శులకు ఇందులో చోటు కలి్పంచారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు, వీలైనంత త్వరగా తమ నివేదికను అందించేందుకు వీలుగా ఈ కమిటీ ఈనెల 23న తొలిసారి భేటీ కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో హైదరాబాద్‌లో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు త్వరలో కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని గత నవంబర్ 24న ఆదేశించారు. గౌబా కమిటీ ఏర్పాటుకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. -
ఎన్నికల రాష్ట్రాల్లో ‘వికసిత్ భారత్ సంకల్ప్’ వద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తమ పథకాలు తదితరాల గురించి ప్రజలకు వివరించేందుకు తలపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ ఐదో తేదీదాకా చేపట్టరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు గురువారం ఈ మేరకు లేఖ రాసింది. ‘నవంబర్ 20 నుంచి మొదలవుతున్న ఈ యాత్ర కోసం జిల్లా రథ్ ప్రహారీలుగా సీనియర్ ప్రభుత్వాధికారులను నామినేట్ చేయాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసినట్టు మా దృష్టికి వచి్చంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న ఐదు రాష్ట్రాల్లో, నాగాలాండ్‌లో ఉపఎన్నిక జరుగుతున్న తపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో డిసెంబర్ ఐదో తేదీదాకా ఇలాంటి కార్యకలాపాలేవీ చేపట్టరాదు’ అని ఆదేశించింది. -
పటిష్టంగా కరోనా నియంత్రణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతుండడం కలవరం కలిగిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని, ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆదేశించారు. కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. గత వారం రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతున్న రాష్ట్రాల్లోని తాజా పరిస్థితిపై ఆయన శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ–కశ్మీర్ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య నిపుణులు, హోం శాఖ అధికారులతో మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీగా జరిమానాలు విధించడం, నిఘా, నియంత్రణను పటిష్టం చేయడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా టెస్టుల సంఖ్య పెంచండి కోవిడ్ వ్యాప్తి నివారణకు గాను నిరంతరం కఠినమైన పర్యవేక్షణ కొనసాగించాల్సిన అవసరం ఉందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా పేర్కొన్నారు. గత ఏడాది సమిష్టి కృషి వల్ల కలిగిన లాభాలను కాపాడాలని సూచించారు. పరీక్షలు నిర్వహిస్తూ కరోనా బాధితులను వేరుగా ఉంచాలన్నారు. పరీక్షల సంఖ్య తగ్గిన జిల్లాల్లో పరీక్షల సంఖ్య పెంచాలని, అధికంగా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాలు, జిల్లాల్లో ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్యను కూడా పెంచాలని ఆదేశించారు. పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిఘా, నియంత్రణపై దృష్టి పెట్టాలన్నారు. హాట్స్పాట్ల గుర్తింపులో వేగం పెంచాలన్నారు. అధిక మరణాలు చోటు చేసుకుంటున్న జిల్లాల్లో క్లినికల్ మేనేజ్మెంట్పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరు రాష్ట్రాల్లో భారీగా కొత్త కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్త కేసులు పెరిగాయి. మహారాష్ట్రలో అత్యధికంగా రోజువారీ కొత్త కేసులు 8,333 నమోదయ్యాయి. కేరళలో 3,671, పంజాబ్‌లో 622 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు ఫిబ్రవరి 14న 34,449 కేసులు ఉండగా.. ప్రస్తుతం 68,810కు చేరాయి. -
కరోనా పరీక్షలపై ఏపీకి కేంద్రం అభినందనలు
సాక్షి, అమరావతి: ఏపీలో అధిక సంఖ్యలో కోవిడ్–19 పరీక్షలు నిర్వహించడంపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ప్రత్యేకంగా అభినందించారు. కరోనా వల్ల సంభవించే మరణాలను కనిష్ట స్థాయికి తెచ్చేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న తొమ్మిది రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, ఆస్పత్రుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంటైన్మెంట్ ప్రాంతాలు, వాటి వెలుపల నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాజీవ్ గౌబ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ నీలం సాహ్ని మాట్లాడుతూ ఏమన్నారంటే.. ► రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రోజూ సరాసరి ఐదు వేలు, రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల దాకా టెస్టులు నిర్వహిస్తాం. ► రాష్ట్ర వ్యాప్తంగా 20 వీఆర్డీఎల్ ల్యాబ్‌లు ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ► టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్, ట్రీట్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టి కేసులు, మరణాల సంఖ్య తగ్గింపునకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ► ఇటీవల పాజిటివ్‌ల సంఖ్య పెరగడంతో మరణాల సంఖ్య కూడా పెరిగింది. ► రాష్ట్ర వ్యాప్తంగా 138 ఆస్పత్రుల ద్వారా కరోనా రోగులకు వైద్య సేవలందిస్తున్నాం. ► వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్ పాల్గొన్నారు. -
కోవిడ్–19 మరణాలు తగ్గించేలా చర్యలు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వల్ల చనిపోయే వారి సంఖ్య ఒక శాతానికంటే తక్కువగా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌గౌబ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలు, వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేసిన మార్గదర్శకాల అమలు తదితర అంశాలపై శనివారం ఆయన ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గౌబ ఏమన్నారంటే.. ► అధిక సంఖ్యలో టెస్టులు నిర్వహించాలి. ► రెడ్ స్పాట్లుగా మారేందుకు అవకాశాలున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలి. ► ఇంటి నుంచి బయిటకు వచ్చినçప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. ► ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలి. ► కరోనా వైరస్ నియంత్రణకు ఆరోగ్య సేతు యాప్ వినియోగం వంటి ఇతర సాంకేతిక విధానాలను పూర్తిగా వినియోగించుకోవాలి. ► ఆస్పత్రుల్లో అవసరమైన పడకలు, ఆక్సిజన్ సౌకర్యం కలిగిన పడకలు, ఐసీయూ, వెంటిలేటర్లు వంటి సౌకర్యాలను ఉంచాలి. ► ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో 60 శాతం పైగా కోలుకునే వారి సంఖ్య పెరిగింది. దీనిని మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలి. ► ప్రస్తుతం దేశంలో రోజుకు 2.50 లక్షల కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచాలి. ► కరోనా కట్టడికై సేవలందిస్తున్న డాక్టర్లు, ఇతర సిబ్బందికై ఇప్పటికే 2 కోట్లకు పైగా ఎన్–95 మాస్క్‌లను, పెద్ద సంఖ్యలో పీపీఈ కిట్లను సరఫరా చేయగా మరిన్ని సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. ► వివిధ రాష్ట్రాల్లో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌గౌబ సీఎస్‌లను అడిగి తెలుసుకున్నారు. ► వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్‌రెడ్డి, శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యనార్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్ పాల్గొన్నారు. -
అలర్ట్ : త్వరలో ఆ రాష్ట్రాలపై కరోనా పంజా
న్యూఢిల్లీ : గత మూడు వారాల్లో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న 145 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వీటిలో గ్రామాలు ఎక్కువ కలిగి ఉన్న జిల్లాలే అధికంగా ఉండటం గమనార్హం. కరోనా నివారణకు సరైన చర్యలు తీసుకోకుంటే ఈ జిల్లాలు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. గురువారం రాష్ట్రాల ప్రతినిధులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ కార్యదర్మి రాజీవ్ గౌబా మాట్లాడుతూ.. భారత్‌లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తిరిగి వస్తుండటంలో త్వరలోనే ఈశాన్య రాష్ట్రాలు అతిపెద్ద కోవిడ్-19 హాట్స్పాట్లుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొదట నామమాత్రంగా కేసులు నమోదయిన బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశాతో సహా 12 రాష్ట్రాల్లో మే 25 వరకు వైరస్ వ్యాప్తి వేగంగా పెరిగిందని తెలిపారు. ఇంతకముందు పదిలోపు కేసులు నమోదైన త్రిపుర, మణిపుర్ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా తాజాగా కేసులు అధికమవుతున్నాయని వెల్లడించారు. (ఒక్క రోజే 7,964 కరోనా కేసులు ) కొత్తగా 145 జిల్లాలను గుర్తించిన హోం మంత్రిత్వ శాఖ ఈ జిల్లాల్లో కేసులు పెరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు నియంత్రణ చర్యలను తీసుకోవాలని చేయాలని ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితిని బట్టి.. ఈ జిల్లాల్లో 2,147 కేసులు నమోదవుతుండగా, ఈ సంఖ్య దేశంలోని మొత్తం కేసులలో 2.5% ఉందని వీటిలో 26 జిల్లాల్లో 20కి పైగా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.. వీటిలో సగం జిల్లాలు అస్సాం, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా,మధ్యప్రదేశ్‌లోనే ఉన్నాయి. కాగా భారత్‌లో ఇప్పటి వరకు 1,65,000 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో గత పదిహేను రోజులుగా కేసుల పెరుగుదల రేటు అధికంగా ఉందని పేర్కొంది. మే 13 వరకు దేశంలో 75 వేల కేసులు వెలుగు చూశాయని, ఇటీవల బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కూడా కేసులు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వలస కార్మికులు తిరిగి రావడం వల్లే ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. వలస కార్మికుల రద్దీ భారీగా ఉన్నందున, రైల్వే, బస్ స్టేషన్లలో ప్రయాణీకులకు సరైన పరీక్షలు చేయడం లేదని, అందువల్లే చాలామంది ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మహమ్మారిని అంటిస్తున్నారని పేర్కొన్నారు. (వాళ్ల కష్టాలు విన్నా.. చూశా: సీఎం జగన్ ) రాష్ట్రంలో ఉన్న 3,200 కేసులలో మూడింట రెండొంతుల మంది వలస కార్మికులే ఉన్నందున ప్రభుత్వం ఆందోళన చెందుతోందని బిహార్ ఆరోగ్య కార్యదర్శి లోకేష్ కుమార్ సింగ్ అన్నారు. బయటి క్వారంటైన్ కేంద్రాల నుంచి కొన్ని కేసులు మాత్రమే నమోదయ్యాయని జార్ఖండ్ మంత్రి రామేశ్వర్ ఓరన్ తెలిపారు. దీనితో వైరస్ వ్యాప్తి ఎక్కువగా లేదన్నారు. అధిక సంఖ్యలో కార్మికులు ఇతర ప్రదేశాల నుంచి తిరిగి వచ్చినప్పటికీ తాము వ్యాప్తిని నియంత్రించగలిగామని పేర్కొన్నారు. (ఇక రాష్ట్రాలదే నిర్ణయం!) మరోవైపు ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో కోవిడ్ -19 నిర్ధారణ రేటు అధికంగా ఉండటంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. మే 18 నుంచి మే 25 మధ్య కాలంలో దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌లలో కోవిడ్ -19 మరణాల రేటు పెరిగినప్పటికీ మిగతా చాలా రాష్ట్రాల్లో తగ్గినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాలతో పోలీస్తే భారత్‌లో మరణాలు, కరోనా నిర్ధారణ సంఖ్య తక్కువగా ఉన్నాయని మాజీ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె కె అగర్వాల్ అన్నారు. -
సీఎస్, పీఎస్‌లతో రాజీవ్ గౌబ మీటింగ్
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్‌లు, పీఎస్‌లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. పలు నగరాల మున్సిపల్ కమీషనర్లు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ‘పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్’పై గౌబా అధికారులతో చర్చించారు. ప్రస్తుత కరోనా పరిస్థితులు, కరోనా కట్టడి కోసం భవిష్యత్ కార్యచరణపై ఆయన చర్చించారు. కాగా, దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్డౌన్ 4.0 మే 31 నాటికి ముగుస్తున్న సంగతి తెలిసిందే. ( నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలి ) లాక్డౌన్ అమలై దాదాపు 60 రోజులు గడుస్తున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. ప్రతి రోజూ కొన్ని వేల మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,58,333 కేసులు నమోదవ్వగా 4,531మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24గంటల్లో 6,566 కరోనా కేసులు నమోదు కాగా, 194 మంది మృత్యువాత పడ్డారు. -
నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలి
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ను మే చివరి వరకు పొడిగించామని, ఈ నేపథ్యంలో నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఆదివారం ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గౌబ ఏమన్నారంటే.. ► జాతీయ రహదారుల వెంట వలస కూలీలు ఎవరూ నడిచి వెళ్లకుండా నివారించాలి. కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలి. ► ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని వినియోగించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. ► రాష్ట్ర, అంతర్రాష్ట్ర పరిధిలో వాహనాల రవాణాపై రాష్ట్రాలు ఆయా పరిస్థితులను బట్టి చర్యలు తీసుకోవాలి. ► ప్రతిచోటా ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలి. ► రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూను కొనసాగించాలి. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్, పరిశ్రమల శాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు పనిచేయాలి
సాక్షి, అమరావతి: అన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు పనిచేసే లా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేశారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ఆదివారం ఢిల్లీ నుంచి ఆయన వివిధ రా ష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మిని స్ట్రేట ర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజీవ్ గౌబ ఏం చెప్పారంటే.. ► వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. ఆ ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలి. ► వలస కార్మికులు రైల్వే ట్రాక్‌లు, రహదారులపై వారి స్వస్థలాలకు నడిచి వెళ్లకుండా ఆపాలి. ఎవరైనా నడిచి వెళుతుంటే వారిని పునరావాస కేంద్రాలకు తరలించి.. ప్రత్యేక రైళ్ల ద్వారా వారి స్వరాష్ట్రాలకు పంపాలి. రైళ్లు ఎప్పుడు బయలుదేరతాయో ముందుగానే వలస కార్మికులకు సమాచారమందించాలి. ► విదేశాల్లో చిక్కుకున్న వారిని విమానాలు, ఓడలు ద్వారా తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఇలా వచ్చే వారిని ఆయా రాష్ట్రాల్లో 14 రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచాలి. ► పరిశ్రమలు పునఃప్రారంభం అవుతున్నందున ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక పారిశ్రామిక భద్రతా చర్యలు తీసుకోవాలి. ► ఈ నెల 17 వరకు కంటైన్మెంట్ ప్రాంతాల్లో, మిగిలిన చోట్ల లాక్డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలి. ► వివిధ జోన్లలో అనుమతిచ్చిన పలు రకాల కార్యకలాపాలను సవ్యంగా జరిగేలా చూడాలి. విజయవాడ ఆర్ అండ్ బీ కార్యాలయంలో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో మల్లికార్జున, వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ అరుణకుమారి పాల్గొన్నారు. -
రాష్ట్రాలు అందుకు సహకరించాలి: రాజీవ్ గౌబా
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా విపత్తు నిర్వహణ చర్యలపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆదివారం కేంద్ర పాలిత ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వైద్యశాఖ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ ప్రభావం, లాక్డౌన్ మినహాయింపులు, కంటైన్మెంట్ జోన్లలో చేపట్టాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. కరోనా యోధులకు తగిన వసతి, సౌకర్యం కల్పించాలని సూచించారు. కరోనా విపత్తు నిర్వహణ చర్యలు తీసుకుంటూనే, ఆర్థిక కార్యకలాపాలు జాగ్రత్తగా ప్రారంభించాలని ఆదేశించారు. (కార్చిచ్చులా కరోనా) అలాగే శ్రామిక రైళ్లు నడిపేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వలస కార్మికులను చేరవేసేందుకు 350 శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయని రాజీవ్ గౌబా వెల్లడించారు. ఇక వందేభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకురావడాన్ని ఆయన వివరించారు. ఈ మిషన్‌కు అన్ని రాష్ట్రాలు సహకరించాలని కోరారు. (ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్) మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాప్తి, లాక్డౌన్ సడలింపు, ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలపై చర్చించేందుకు మరోసారి ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. రేపు (సోమవారం) మధ్యాహ్నాం 3 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. -
గ్యాస్ లీకేజీ: రెండో రోజు ఎన్సీఎమ్సీ సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ రెండో రోజు సమీక్ష జరిపింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ఏపీ చీఫ్ సెక్రటరీ తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు. ఈ సందర్భంగా కెమికల్ సేఫ్టీకి సంబంధించి అంతర్జాతీయ నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన కమిటీ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన కెమికల్స్ పంపేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. కాగా, ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ ఘటనపై శుక్రవారం ఐఏఎస్‌ల హైపవర్ కమిటీ విచారణ ప్రారంభమైంది. కమిటీ ఛైర్మన్ సీనియర్ ఐఏఎస్ అధికారి, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలవెన్.. కమిటీ కన్వీనర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు వివేక్ యాదవ్, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌లు ఈ విచారణలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు అరగంటకు పైగా కంపెనీలో గ్యాస్ లీక్ అయిన తీరుపై అధికారులు, కార్మికులను విచారించారు. -
విదేశాల్లో ఉన్న వారిని తీసుకొచ్చేలా చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా రెడ్, ఆరెంజ్ జిల్లాల్లో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. అలాగే దేశ వ్యాప్తంగా అమలువుతున్న లాక్‌డౌన్‌పై ఆయన ఆరా తీశారు. రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే అంశంపై విదేశీ వ్యవహారాలు, హోం శాఖల అధికారులు రాష్ట్రాలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వీడియో సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్,కొవిడ్ కంట్రోల్ రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ మరియు ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్, పరిశ్రమల శాఖ కమీషనర్ సుబ్రహ్మణ్యం, ఐజి వినీత్ బ్రిజ్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలను వివరించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కేసులు అధికంగా నమోదైనా ఆందోళన చెందొద్దు
సాక్షి, అమరావతి: కొన్ని రాష్ట్రాల్లో టెస్టులు ఎక్కువగా చేయడం వల్ల కేసుల సంఖ్య పెరగవచ్చని, దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణకు లాక్ డౌన్ నిబంధనలను మే 3వ తేదీ వరకు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలను ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ఆదివారం ఢిల్లీ నుంచి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. అవేంటంటే.. ► రెడ్ జోన్లు, కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలి. అందుబాటులో ఉన్న అన్ని సదుపాయాలను పూర్తిగా వినియోగించుకోవాలి. కేసులు నమోదవుతున్న జిల్లాల్లో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. ► రంజాన్ తదితర పర్వదినాలను పురస్కరించుకుని అధిక సంఖ్యలో ప్రజలు ఒక చోట గుమికూడ కుండా ఎవరి ఇళ్లలో వారు వేడుకలను జరుపుకోవాలి. ఈ విషయమై ఆయా మత పెద్దలతో రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడి తగిన సూచనలు ఇవ్వాలి. ► రేషన్ దుకాణాలు, నిత్యావసర సరుకులు తీసుకునే చోట, రైతు బజారులు, ఏటీఎంలు, బ్యాంకులు వంటి ప్రతి చోటా ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించేలా ప్రజలందరిలో పెద్ద ఎత్తున అవగాహన కలిగించాలి. ఏ రాష్ట్రంలోనూ కరోనా కేసుల సంఖ్యను తక్కువగా చూపడం లేదా దాచిపెట్టడం వంటి ప్రయత్నాలు చేయవద్దు. ఏపీలో రోజుకు 8 వేల టెస్టులు: సీఎస్ నీలం సాహ్ని ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోవిడ్ పరీక్షలు అధిక సంఖ్యలో నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం రోజుకు ఎనిమిది వేల మందికి పరీక్షలు చేస్తున్నామని, ఈ సంఖ్యను పది వేలకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న కిట్లతో ఎక్కువ టెస్టులు చేస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్ పాల్గొన్నారు. టెస్టుల్లో మరింత ముందుకు ఏపీలో సగటున పది లక్షల జనాభాకు 1,274 టెస్టులు రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు పెరుగుతున్నాయి. ఆదివారం నాటికి టెస్టుల్లో ఏపీ మరింత ముందడుగు వేసింది. రాష్ట్రంలో పది లక్షల జనాభాకు సగటున 1274 టెస్టులు చేశారు. దేశంలో సగటున పది లక్షల జనాభాకు 451 మందికే టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో వేయికి పైగా టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ముందుకు వెళుతోంది. ఆదివారం సాయంత్రం నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 68,034 టెస్టులు చేస్తే 1097 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మన రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 1.6 శాతం మాత్రమే ఉన్నాయి. దేశంలో పాజిటివ్ కేసుల శాతం 4.21 శాతంగా నమోదైంది. -
ఆర్థిక ఇబ్బందులున్నా.. కరోనాపై రాజీపడొద్దు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్వల్ల తాత్కాలికంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రజారోగ్య పరిరక్షణలో ఎంతమాత్రం రాజీపడొద్దని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టంచేశారు. కోవిడ్–19 నియంత్రణ చర్యలపై ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గౌబ మాట్లాడుతూ.. గత నెలరోజులకుపైగా లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేస్తూ కరోనా వైరస్ నియంత్రణకు విశేష కృషిచేస్తున్నందుకు అన్ని రాష్ట్రాలను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► ఈనెల 20న గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర మినహాయింపులిచ్చాం. ఆయాచోట్ల పెద్దఎత్తున ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. ► అక్కడ పరిశ్రమలు, తయారీ యూనిట్లు, ఎస్ఈజడ్లు, ఎక్స్పోర్ట్ జోన్లు వంటివి పనిచేసేలా.. కార్మికులు భౌతిక దూరం పాటించేలా చూడాలి. ► చిన్నచిన్న దుకాణాలన్నీ యథావిధిగా నిర్వహించుకునేందుకు వీలు కల్పించాం. ► వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలకు తగిన సౌకర్యాలు కల్పించాలి. కేంద్ర హోంశాఖ ఆదేశాలకు లోబడి ఆయా రాష్ట్రాలతో మాట్లాడి వారిని సొంత రాష్ట్రాలకు పంపించే విషయంపై నిర్ణయం తీసుకోవాలి. ► విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చే అంశంపై కేంద్రం ప్రయత్నిస్తోంది. సర్కారుపై ప్రజల్లో నమ్మకం ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వంపై పూర్తి నమ్మకంతో ఉన్నారన్నారు. ప్రస్తుతం గ్రామాల్లోని గ్రీన్‌జోన్ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని ఆమె తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు మూసి ఉన్నందున తగిన ఎగుమతులకు అవకాశాల్లేక ఉద్యానవన, ఆక్వా తదితర రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆమె రాజీవ్ గౌబ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. కేఎస్.జవహర్‌రెడ్డి, శాంతిభద్రతల అదనపు డీజి రవిశంకర్ అయ్యన్నార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ పీయూష్‌కుమార్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్, ఐజి ఎన్ఫోర్స్మెంట్ వినీత్ బ్రిజ్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. -
మరింత పటిష్టంగా లాక్డౌన్
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా మే 3 వరకూ లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను, డీజీపీలను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీ నుండి కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, అందరితో సంప్రదించిన తర్వాత ప్రధాని మోదీ మే 3 వరకూ లాక్డౌన్ కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. హాట్ స్పాట్లపై మరింత దృష్టి ► హాట్ స్పాట్ ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. కరోనా పరీక్షలు అధిక సంఖ్యలో నిర్వహించాలి. లాక్‌డౌన్‌కు సంబంధించి మరికొన్ని సేవలకు ఈ నెల 20 నుండి మినహాయింపులు ఇస్తున్నాం. ఆ మేరకు మార్గదర్శకాలు జారీ అవుతాయి. ► నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఇతర వస్తువులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. సరుకు రవాణా చేసే వాహనాలకు పూర్తి మినహాయింపులు ఇస్తాం. ► వ్యవసాయ, అనుబంధ రంగాల పనులు పూర్తిగా జరిగేలా చూడాలి. ఉపాధి హామీ పథకం పనులకు పూర్తి మినహాయింపు ఇచ్చాం. ఆ పనుల్లో పాల్గొనే కూలీలు తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా చూడాలి. అన్ని విధాలా సన్నద్ధత –సీఎస్ నీలం సాహ్ని ► ఆంధ్రప్రదేశ్‌లో ఆసుపత్రుల సన్నద్ధతకు తగిన చర్యలు తీసుకున్నాం. అధిక సంఖ్యలో కరోనా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. రాష్ట్రంలో ప్రస్తుతం 165 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. ► రాష్ట్రంలో పటిష్టంగా లాక్డౌన్ అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నామ ని డీజీపీ గౌతం సవాంగ్ వివరించారు. -
ఏప్రిల్ 20 తర్వాత లాక్డౌన్ సడలింపు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను, డీజీపీను ఆదేశించారు. ఈమేరకు బుధవారం ఆయన ఢిల్లీ నుంచి కరోనా వైరస్‌పై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గౌబ మాట్లాడుతూ... దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అందరితో సంప్రదించి, వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే 3వరకూ లాక్‌డౌన్‌ను పెంచారని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌కు సంబంధించిన నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యే విధంగా చూడాలని స్పష్టం చేశారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లోను, కంటోన్మెంట్ జోన్ల పరిధిలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కరోనాకు సంబంధించిన పరీక్షలు అధిక సంఖ్యలో నిర్వహించాలని చెప్పారు. లాక్‌డౌన్‌కు సంబంధించి కొన్ని సేవలకు ఏప్రిల్ 20 నుంచి మినహాయింపులు ఇవ్వడం జరుగుతుందని అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుందని రాజీవ్ గౌబ తెలిపారు. లాక్డౌన్ నేపధ్యంలో దేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తువులు కూరగాయలు ఇతర వస్తువులకు ఇబ్బంది లేకుండా ఇప్పటికే చర్యలు తీసుకోగా ఏప్రిల్ 20 నుంచి మరిన్ని సేవలకు లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. సరుకు రవాణా చేసే వాహనాలకు పూర్తి మినహాయింపులు ఉంటుందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారని తెలిపారు. వ్యవసాయ,అనుబంధ రంగాల పనులు పూర్తిగా జరిగేలా చూడాలని చెప్పారు. అలాగే ఉపాధి హామీ పథకం పనులకు పూర్తి మినహాయింపును ఇవ్వడం జరిగిందని అయితే ఆ పనుల్లో పాల్గొనే కూలీలు తప్పనిసరిగా మాస్క్‌లను ధరించడం తోపాటు సామాజిక దూరాన్ని పాటించేలా చూడాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ చిన్న తరహా పరిశ్రమలన్నీ పనిచేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అయితే అక్కడ పనిచేసే కార్మికులకు మాస్క్‌లను ధరించడం సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాని గ్రీన్ జోన్లు ప్రాంతాల్లో యధావిధిగా కార్యకలాపాలు జరిగేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని రాజీవ్ గౌబ చెప్పారు. ఏపీలో 165 కంటోన్మెంట్ జోన్లు ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 165 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయని వివరించారు. లాక్ డౌన్ కు సంబంధించిన అన్ని నిబంధనలను ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆసుపత్రుల సన్నద్ధతకు తగిన చర్యలు తీసుకుంటుంన్నామని అదే విధంగా అధిక సంఖ్యలో కరోనా పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని నీలం సాహ్ని వివరించారు. కాగా రాష్ట్రంలో కరోనా ప్రవేట్ టెస్టింగ్ ల్యాబ్స్ లేవని అన్నారు. ఈ వీడియో సమావేశంలో డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
మరింత కట్టుదిట్టంగా లాక్డౌన్
సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ను జయించేందుకు వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని.. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సూచించారు. ఈ సమయంలో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలుచేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. కోవిడ్–19 కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల కలెక్టర్లు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వైరస్ వ్యాప్తి నియంత్రణకు అనుసరించాల్సిన విధానంపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం రాజీవ్ గౌబ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు పనిచేసేలా చూడాలని సీఎస్‌లకు సూచించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే.. ► ఆహారం, మందులకు ఎక్కడా ఇబ్బందులు రాకూడదు. ► లాక్డౌన్, కంటైన్మెంట్ విధానాలను పటిష్టంగా అమలుచేయాలి. ► ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలి. ► లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేయడం ద్వారా కరోనా మహమ్మారిని దేశం నుండి తరిమికొట్టాలి. ► జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా సీఎస్‌లు, కలెక్టర్లు చూడాలి. ► రాష్ట్రాలు, జిల్లాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ వనరులన్నింటినీ పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని అవసరమైన సమయంలో అవసరమైన ప్రాంతాల్లో సక్రమంగా వినియోగించుకోవాలి. ► హైరిస్క్ ఉన్న వారంతా విధిగా క్వారంటైన్ కేంద్రాలు లేదా ఐసోలేషన్‌లో ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె. భాస్కర్ పాల్గొన్నారు. -
ఆ వదంతులు అవాస్తవం: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన 21రోజుల లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారనే వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. లాక్డౌన్ గడువు పెంచుతారన్న వదంతులు అవాస్తమని తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా స్పందించారు. దేశ వ్యాప్త లాక్డౌన్ 21 రోజులేనని స్పష్టం చేశారు. లాక్డౌన్ పెంపు వార్తలు అవాస్తవం, నిరాధారమన్నారు. కాగా, కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు 21 రోజుల దేశ వ్యాప్త లాక్‌డౌన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కరోనా చైన్‌ను తెంచడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రయాణాలను మానుకోవాలని, ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని విజ్ఞప్తి చేశారు. ( కరోనా 'లాక్డౌన్'పై సీరియస్‌నెస్ ఏదీ? ) ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మరోసారి లాక్డౌన్ గురించి మోదీ మాట్లాడుతూ.. ప్రజలను ఇబ్బంది పెట్టే (ముఖ్యంగా పేద ప్రజల్ని) నిర్ణయం తీసుకున్నందుకు క్షమాపణ కోరారు. కరోనాను అదుపు చేసేందుకు ఇంతకంటే మంచి మార్గం లేదని, ప్రజలు తనను తప్పకుండా క్షమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో ఇప్పటి వరకు 1071 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 29 మంది మృత్యువాత పడ్డారు. Alert : There are rumours & media reports, claiming that the Government will extend the #Lockdown21 when it expires. The Cabinet Secretary has denied these reports, and stated that they are baseless#PIBFactCheck#lockdownindia #coronaupdatesindia #IndiaFightsCorona — PIB India 🇮🇳 #StayHome #StaySafe (@PIB_India) March 30, 2020 -
ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వద్దు
సాక్షి, అమరావతి: హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని, లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఆదివారం ఢిల్లీ నుంచి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడంతో పాటు కేంద్రం రాష్ట్రాలకు జారీ చేస్తున్న మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేస్తున్నందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఇతర అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ► వివిధ రాష్ట్రాల సరిహద్దులు, జాతీయ రహదారులపై చిక్కుకున్న వలస కూలీలు, కార్మికులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించాలి. ఇందుకోసం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నిధులను వినియోగించుకోవాలి. ► నిత్యావసర వస్తువులు, సరుకులు రవాణా చేసే వివిధ రకాల వాహనాలకు ఎక్కడా ఆటంకం లేకుండా వాటి నిర్ధేశిత ప్రాంతాలకు సకాలంలో చేరుకునేలా చూడాలి. అలాగే ప్రజలందరికీ నిత్యావసరాలు సక్రమంగా అందేలా చూడాలి. ► కోవిడ్ ఆస్పత్రులుగా గుర్తించిన చోట్ల తగిన సౌకర్యాలు పూర్తిగా అందుబాటులో ఉంచుకోవాలి. కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. పటిష్టంగా అమలు చేస్తున్నాం: సతీష్ చంద్ర వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మాట్లాడుతూ.. ఏపీలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలను రైతు బజార్లు, మొబైల్ వ్యాన్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు వివరించారు. అలాగే ఒక్కో మనిషికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు వంటి రేషన్ సరుకులను 15 రోజులకు ఒకసారి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కర్ణాటకలోని కోలార్ నుంచి రాష్ట్ర సరిహద్దు చిత్తూరు జిల్లాకు చేరుకున్న 1,500 కూలీలకు సంబంధించిన అంశాన్ని ఆ రాష్ట్ర అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని తెలిపారు. -
కరోనా: ఆ 15 లక్షల మందిపై నిఘా
న్యూఢిల్లీ: గత రెండు నెలల్లో విదేశాల నుంచి వచ్చిన వారందరినీ గుర్తించి ‘కోవిడ్-19’ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. జనవరి 18 నుంచి మార్చి 23 వరకు విదేశాల నుంచి మన దేశానికి 15 లక్షల మంది వచ్చారని కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా తెలిపారు. ఈ సంఖ్యకు, ప్రస్తుతం పర్యవేక్షణలో ఉన్నవారికి మధ్య అంతరం ఎక్కువగా ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చిన 15 లక్షల మందిని తక్షణమే గుర్తించి ‘కోవిడ్’ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖల్లో ఆదేశించారు. కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఈ 15 లక్షల మందిపై గట్టి నిఘా ఉంచాలని పేర్కొన్నారు. అందుకే లాక్డౌన్: కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడి వ్యక్తులు.. అక్కడే ఉండాలనే ఉద్దేశంతోనే లాక్డౌన్ అమలు చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఎక్కడి వ్యక్తులు.. అక్కడే ఉంటే సురక్షితంగా ఉంటారని సూచించింది. విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచాలని రాష్ట్రాలను ఆదేశించినట్టు వెల్లడించింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అదనపు ఆస్పత్రులు సిద్ధంగా ఉంచాలని రాష్ట్రాలను కోరినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 1.4 లక్షల కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరినట్టు ప్రకటించింది. (కరోనాపై గెలుపు: ఇటలీలో అద్భుతం) -
మూడు వారాలు కఠినంగా లాక్డౌన్
సాక్షి, అమరావతి : వచ్చే మూడు వారాల పాటు లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు. కోవిడ్–19పై గురువారం ఆయన ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఏ విధంగా అమలవుతున్నదీ ఆయా రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి ఆదేశాలు ఇలా.. ►లాక్డౌన్లో రానున్న మూడు వారాలు చాలా కీలకం. అందువల్ల నిత్యావసర సరుకులు రవాణా చేసే లారీలు, ట్రక్కులు, గూడ్స్ వాహనాలు నిర్దేశిత ప్రాంతాలకు సకాలంలో చేరుకునేలా అన్ని చెక్‌పోస్టుల వద్ద ఆటంకం కలుగకుండా చూడాలి. ►మందులు, ఇతర నిత్యావసర వస్తువులు ఇళ్ల వద్దకే సరఫరా చేసే డెలివరీ బాయ్‌లకు కూడా అవకాశం ఇవ్వాలి. నిత్యావసర వస్తువుల కొనుగోలు సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా చూడాలి. ►లాక్ డౌన్ వల్ల ఆయా రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వేరే రాష్ట్రాల వారికి భోజనం, వసతి కల్పించాలి. ►ప్రత్యేకంగా కోవిడ్‌కు చికిత్స కోసం కొన్ని ఆసుపత్రులను సిద్ధం చేసుకోవాలి. అన్ని ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు పరచాలి. వైద్య పరికరాలను సమకూర్చుకోవాలి. ►దేశ వ్యాప్తంగా 8 లక్షల మందికిపైగా విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి, వారికి సూచనలు, సలహాలు, వైద్యం అందిస్తున్నందుకు అన్ని రాష్ట్రాలకు అభినందనలు. రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోంది : సీఎస్ నీలం సాహ్ని ►రాష్ట్రంలో లాక్ డౌన్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నాం. ►కూరగాయలు, నిత్యావసరాల సప్లయ్ చైన్ సక్రమంగా సాగుతోంది. ►ఇందుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో 1902 నంబర్‌తో కూడిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. } ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 22న ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.వెయ్యి, బియ్యం, పప్పు.. వలంటీర్ల ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ గౌతమ్ సవాంగ్, రహదారులు–భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘మెట్రో’ల్లో మహిళల భద్రతకు సమగ్ర ప్రణాళిక
న్యూఢిల్లీ: ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ సహా 8 మెట్రోపాలిటన్ నగరాల్లో మహిళల భద్రతను కట్టుదిట్టం చేసేలా త్వరలోనే సమగ్ర ప్రణాళికను అమలు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అత్యవసర ప్రతిస్పందన బృందాలు, పోలీసు ధ్రువీకరణ పొందిన ప్రజారవాణా వ్యవస్థల ఏర్పాటు, పోలీస్‌శాఖలో 33% మహిళా రిజర్వేషన్లు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, సైబర్ నేరాల నియంత్రణ, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు ఈ ప్రణాళికలో భాగంగా ఉంటాయని వెల్లడించింది. మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ కమిషనర్లు, పౌర సమాజం ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులతో బుధవారం నాడిక్కడ సమావేశమైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా.. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, లక్నో నగరాల్లో మహిళల రక్షణకు అనుసరిస్తున్న విధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ఢిల్లీ పోలీసులు ప్రవేశపెట్టిన ‘హిమ్మత్’ యాప్, హైదరాబాద్ పోలీసులు ప్రారంభించిన ‘హ్యాక్ఐ’, భరోసా కార్యక్రమం, బెంగళూరు పోలీసులు తెచ్చిన ‘సురక్షా’ యాప్, యూపీ పోలీసులు ప్రారంభించిన ‘పవర్ ఏంజిల్స్’ కార్యక్రమంపై చర్చించారు. తొలుత ఈ 8 నగరాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు మహిళల భద్రతపై ప్రణాళికల్ని రూపొందించి ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలోని కమిటీలకు పంపుతాయని రాజీవ్ గౌబా మీడియాకు తెలిపారు. వారు పంపిన ప్రణాళికల్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ పరిశీలించి తగిన సూచనలు చేస్తుందన్నారు. -
మహిళల రక్షణ కోసం కొత్త పరికరం
న్యూఢిల్లీ: దేశంలో మహిళలు, వయోవృద్ధుల భద్రత కోసం కేంద్రం ప్రత్యేక పరికరాన్ని రూపొందిస్తోంది. ఈ పరికరం అత్యవసర సమయాల్లో పెద్ద ధ్వనితో అలారం మోగించడంతో పాటు, ముందుగా ఏర్పా టు చేసిన పలు ఫోన్ నంబర్లకు సందేశాన్ని పంపుతుంది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ‘సెక్యూర్ సిటీస్-2013’ సదస్సులో కేంద్ర సమాచార, ప్రసార శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ వివరాలు తెలి పారు. ఢిల్లీ ఐఐటీ, తిరువనంతపురంలోని సీడాక్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయన్నారు. అందరికీ అందుబాటులో ఉండే ధరలో, భారీ స్థాయి లో ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టులో సవాళ్లన్నారు.