
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్‌లు, పీఎస్‌లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. పలు నగరాల మున్సిపల్ కమీషనర్‌లు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ‘పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్’పై గౌబా అధికారులతో చర్చించారు. ప్రస్తుత కరోనా పరిస్థితులు, కరోనా కట్టడి కోసం భవిష్యత్ కార్యచరణపై ఆయన చర్చించారు. కాగా, దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్ 4.0 మే 31 నాటికి ముగుస్తున్న సంగతి తెలిసిందే. ( నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలి )
లాక్‌డౌన్ అమలై దాదాపు 60 రోజులు గడుస్తున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. ప్రతి రోజూ కొన్ని వేల మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,58,333 కేసులు నమోదవ్వగా 4,531మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24గంటల్లో 6,566 కరోనా కేసులు నమోదు కాగా, 194 మంది మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment