మరింత పటిష్టంగా లాక్‌డౌన్‌ | Rajiv Gauba Comments About Lockdown In Video Conference | Sakshi
Sakshi News home page

మరింత పటిష్టంగా లాక్‌డౌన్‌

Published Thu, Apr 16 2020 5:43 AM | Last Updated on Thu, Apr 16 2020 5:43 AM

Rajiv Gauba Comments About Lockdown In Video Conference - Sakshi

సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా మే 3 వరకూ లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను, డీజీపీలను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీ నుండి కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణపై రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, అందరితో సంప్రదించిన తర్వాత ప్రధాని మోదీ మే 3 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.  
 
హాట్‌ స్పాట్‌లపై మరింత దృష్టి 
► హాట్‌ స్పాట్‌ ప్రాంతాలు, కంటైన్‌మెంట్‌ జోన్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. కరోనా పరీక్షలు అధిక సంఖ్యలో నిర్వహించాలి. లాక్‌డౌన్‌కు సంబంధించి మరికొన్ని సేవలకు ఈ నెల 20 నుండి మినహాయింపులు ఇస్తున్నాం. ఆ మేరకు మార్గదర్శకాలు జారీ అవుతాయి.  
► నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఇతర వస్తువులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. సరుకు రవాణా చేసే వాహనాలకు పూర్తి మినహాయింపులు ఇస్తాం.  
► వ్యవసాయ, అనుబంధ రంగాల పనులు పూర్తిగా జరిగేలా చూడాలి. ఉపాధి హామీ పథకం పనులకు పూర్తి మినహాయింపు ఇచ్చాం.  ఆ పనుల్లో పాల్గొనే కూలీలు తప్పనిసరిగా మాస్క్‌ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా చూడాలి. 

అన్ని విధాలా సన్నద్ధత
–సీఎస్‌ నీలం సాహ్ని 
► ఆంధ్రప్రదేశ్‌లో ఆసుపత్రుల సన్నద్ధతకు తగిన చర్యలు తీసుకున్నాం. అధిక సంఖ్యలో కరోనా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. రాష్ట్రంలో ప్రస్తుతం 165 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. 
► రాష్ట్రంలో పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నామ ని డీజీపీ గౌతం సవాంగ్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement