ఎన్నికల్లో ధనబలం, అక్రమ మద్యం, ఉచితాల పంపిణీపై పకడ్బందీగా నిఘా
రాష్ట్రానికి సాధారణ ప్రత్యేక పరిశీలకునిగా రిటైర్డ్ ఐఏఎస్ రామ్మోహన్ మిశ్రా..
పోలీస్ ప్రత్యేక పరిశీలకునిగా దీపక్ మిశ్రా
రాష్ట్ర వ్యయ పరిశీలకునిగా రిటైర్డ్ ఐఆర్‌ఎస్ నిగమ్
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): వచ్చే నెలలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఎన్నికల్లో డబ్బు, కండ బలం, అక్రమ మద్యం, ఉచితాల పంపిణీపై పకడ్బందీగా నిఘా పెట్టేందుకు ఏపీ సహా బిహార్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌కు ఈ ప్రత్యేక పరిశీలకులు నియమితులయ్యారు. మంచి ట్రాక్ రికార్డు కలిగిన రిటైర్డ్ సివిల్ సర్విసు అధికారులను నియమించడమే కాక ఆయా రాష్ట్రాల్లో పర్యవేక్షించాల్సిన అంశాలను సీఈసీ వివరించింది.
ఆంధ్రప్రదేశ్‌కు సాధారణ ప్రత్యేక పరిశీలకునిగా రిటైర్డ్ ఐఏఎస్ రామ్మోహన్ మిశ్రా, పోలీసు ప్రత్యేక పరిశీలకునిగా దీపక్ మిశ్రా, వ్యయ పరిశీలకునిగా రిటైర్డ్ ఐఆర్‌ఎస్ నిగమ్‌ను నియమించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై వీరు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ నిఘా ఉంచుతారని పేర్కొంది. అలాగే..
♦ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జిల్లాల్లో నియమించిన ఇతర ఎన్నికల పరిశీలకుల పనికి ఇబ్బంది కలిగించకుండా ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. సమన్వయ విధానంలో ఉమ్మడి లక్ష్యాల కోసం పనిచేయాల్సి ఉంటుంది.
♦ ప్రాంతీయ అధిపతులు, పర్యవేక్షణ కార్యకలాపాల్లో పాల్గొన్న వివిధ ఏజెన్సీలు, నోడల్ అధికారులతో సమస్వయం చేసుకుని అవసరమైన సమాచారాన్ని పొందే అధికారం కలిగి ఉంటారు.
♦ ఎన్నికల సందర్భంగా సరిహద్దు ప్రాంతాలు ఎదుర్కొనే సున్నితమైన సమస్యలు, ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలి.
♦ ఎన్నికల ప్రక్రియలో కమిషన్ మార్గదర్శకాల అమలు, ఇంటర్ ఏజెన్సీ సమన్వయం, తప్పుడు సమాచారంపై అధికారుల ప్రతిస్పందన కోసం వెచి్చస్తున్న సమయం, ఎన్నికలకు 72 గంటల ముందు చేయకూడని.. చేయాల్సిన పనులను పర్యవేక్షించడం, స్వేచ్ఛగా.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి.
♦ ఇక ఎన్నికల సంఘం లేదా జోనల్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, డీసీఈఓలు, ఎస్పీలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నిర్వహించే సమావేశాల్లో కూడా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తారు.
♦ ఎన్నికలు నిష్పాక్షికత, విశ్వసనీయతను నిర్ధారించడానికి కీలకమైన పూర్తి బాధ్యతలను, అధికారాలను ఈ పరిశీలకులకు అప్పగించారు.
జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు భేష్
ఇక సాధారణ ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని రామ్మోహన్ మిశ్రా అభినందించారు. ఇదే పంథాను చివరివరకు కొనసాగించాలని సూచించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ఇంటెగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూంను, ఎంసీఎంసీ, సోషల్ మీడియా విభాగాలను మంగళవారం ఆయన పరిశీలించారు.
కంట్రోల్ రూమ్‌లోని సీ–విజిల్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఐటీ, బ్యాంకింగ్, కమర్షియల్ టాక్స్, ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈఎస్‌ఎంఎస్), కస్టమ్స్ తదితర విభాగాల కార్యకలాపాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ టీకే రాణా వివరించారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల వివరాలు, గత ఎన్నికల్లో పోలింగ్ శాతం వంటి వివరాలను చెప్పారు. ఈ ఎన్నికల్లో జిల్లాలో 85 శాతం ఓటింగ్ లక్ష్యంగా విస్తృత ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
ఈనెల 13, 14 తేదీల్లో ఈ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు. అదేవిధంగా పోలీస్ కమిషనర్ టీకే రాణా జిల్లాలో ఎలక్షన్ సీజర్లను, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరించారు. కంట్రోల్ రూమ్ పనితీరుపట్ల కూడా రామ్మోహన్ సంతృప్తి వ్యక్తంచేశారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే డేటాను సరైన విధంగా విశ్లేíÙంచి సరైన కార్యాచరణ దిశగా అడుగులేయాలన్నారు.
అనంతరం గూడవల్లి ఇంటర్ డి్రస్టిక్ట్ బోర్డర్ చెక్‌పోస్టును ఆయన సందర్శించి సిబ్బందికి సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్‌కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఆర్వో వి.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్డీఓ బీహెచ్ భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment