పోలీసులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం | Altercation Between Police and BJP Leaders in Badwelu | Sakshi
Sakshi News home page

పోలీసులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం

Published Fri, Oct 18 2019 1:56 PM | Last Updated on Fri, Oct 18 2019 2:43 PM

Altercation Between Police and BJP Leaders in Badwelu - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : బీజేపీ చేపట్టిన గాంధీ సంకల్ప యాత్రలో శుక్రవారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బద్వేలులో యాత్ర నిర్వహిస్తున్న బీజేపీ నేతలు స్థానిక గాంధీ విగ్రహం వద్ద సభ ఏర్పాటు చేశారు. సభలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆ పార్టీ నేతలను ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పక్కనుంచి వెళ్లమని  పోలీసులు సూచించారు. దీంతో కోపోద్రిక్తులైన బీజేపీ నాయకులు పోలీసులపై ఫైర్‌ అయ్యారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే వాగ్వాదం ఉద్రిక్తంగా మారే అవకాశముండడంతో పోలీసులే వెనక్కు తగ్గారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement