సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీలో కొత్తగా ఏర్పాటైన కమిటీల్లో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావులకు చోటు దక్కింది. ‘బేటీ బచావ్-బేటీ పఢావ్’ కమిటీలో నిర్మలా సీతారామన్‌తో పాటు రేణుదేవి, రాజేంద్ర ఫడ్కే, హెచ్.రాజాలు ఉన్నారు. శిక్షణ కమిటీలో మురళీధర్‌రావుతోపాటు వి.సతీష్, రాంప్యారే పాండే, మహేశ్ శర్మ, ఎల్.గణేశన్, బాలశంకర్, సురేశ్ పుజారీలు ఉన్నారు.
క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడుగా గణేషిలాల్, సభ్యులుగా విజయ్ చక్రవర్తి, సత్యదేవ్ సింగ్ నియమితులయ్యారు.పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాల మేరకు కార్యాలయ నిర్మాణ కమిటీ, ఆజీవన్ సహయోగ్ కమిటీ, సంపర్క్ అభియాన్, కార్యాలయ ఆధునీకరణ, స్వచ్ఛతా అభియాన్, నమామీ గంగే కమిటీలను ఏర్పాటు చేశారు.