సీక్రెట్‌ నిఖా.. తల్లి కాబోతున్న రాఖీ సావంత్‌? | Is Rakhi Sawant expecting First Child with Husband Adil Khan Durrani? | Sakshi
Sakshi News home page

Rakhi Sawant: సీక్రెట్‌గా వివాహం.. గర్భం దాల్చిన నటి? అంతలోనే విషాదం!

Published Wed, Jan 18 2023 4:48 PM | Last Updated on Wed, Jan 18 2023 5:02 PM

Is Rakhi Sawant expecting First Child with Husband Adil Khan Durrani? - Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ రాఖీ సావంత్‌ గతేడాది గుట్టుచప్పుడు కాకుండా నిఖా చేసుకుంది. కానీ ఆ విషయాన్ని చాలా ఆలస్యంగా ఇటీవలే బయటపెట్టింది. మొదట్లో అలాంటిదేం లేదన్న ప్రియుడు అదిల్‌.. తర్వాత మాత్రం అవును పెళ్లి జరిగిందని తలూపాడు. ఇక అప్పటినుంచి కొత్త పెళ్లికూతురిలా ఫీలవుతోంది రాఖీ. తన దగ్గరకు ఎవరైనా అభిమానులు వచ్చినా సరే డోంట్‌ టచ్‌ మీ.. అంటూ కొత్తగా ప్రవర్తిస్తోంది. ఇకపోతే రాఖీ సావంత్‌ తల్లి కాబోతుందంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదే విషయమై రాఖీని అడగ్గా ఆమె అవునని కానీ కాదని కానీ ఎలాంటి సమాధానమివ్వలేదు. నో కామెంట్స్‌ అంటూ సైలెంట్‌గా వెళ్లిపోయింది. అయితే రాఖీ గర్భం దాల్చిన మాట వాస్తవమేనట. బిగ్‌బాస్‌ మరాఠీ షోలో ఈ విషయాన్ని రాఖీ వెల్లడించినట్లు తెలుస్తోంది. కానీ ఎవరూ దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే ఆ సంతోషం తనకు ఎంతోకాలం నిలవలేదు. తనకు గర్భస్రావం అవడంతో తీవ్ర మనోవేదనకు గురైందట రాఖీ.

ఇకపోతే తన పెళ్లి గురించి ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'గతేడాది జూలైలోనే మా వివాహం జరిగింది. కానీ అదిల్‌కు మా పెళ్లి విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం ఇష్టం లేదు. అందుకే నేను గమ్మునుండిపోయా. నన్ను పెళ్లి చేసుకున్నానని అందరికీ తెలిస్తే తన చెల్లికి పెళ్లవుతుందో లేదోనని భయపడ్డాడు. కానీ సల్మాన్‌ భాయ్‌ అతడికి నచ్చజెప్పడంతో చివరకు పెళ్లి జరిగిందని అంగీకరించాడు' అని చెప్పుకొచ్చింది.

చదవండి: ఇంకెన్నిసార్లు ఇదే సినిమా వేస్తార్రా బాబూ.. ఇక చాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement