సుశాంత్‌ నా బిడ్డగా పుట్టబోతున్నాడు: నటి | Rakhi Sawant Comments On Sushant Singh Rajput Suicide | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ నా కలలోకి వచ్చాడు: రాఖీ సావంత్‌

Published Mon, Jun 22 2020 8:29 PM | Last Updated on Mon, Jun 22 2020 8:50 PM

Rakhi Sawant Comments On Sushant Singh Rajput Suicide - Sakshi

ముంబై: బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి వారం దాటుతున్న ఇంకా ఎవరు ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య బాలీవుడ్ వర్గాలలో కలకలం రేపింది. సుశాంత్‌ మరణించినప్పటి నుంచి బాలీవుడ్‌ ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు. స్టార్‌ కిడ్స్‌పై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. బాలీవుడ్‌లో బంధుప్రీతి ఎక్కువగా ఉందని, టాలెంట్‌ ఉన్నవారిని తొక్కేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్‌ఫాలో స్టార్‌ కిడ్స్‌ అంటూ క్యాంపెయిన్‌ కూడా నిర్శహిస్తున్నారు. అభిమానులే కాకుండా బాలీవుడ్‌ స్టార్‌లు కూడా సుశాంత్‌ మరణం తరువాత బాలీవుడ్‌లో నెపోటిజం ఎక్కువగా ఉందంటూ తమకు ఎదురైన చేదు అనుభవనాలను బయటపడుతున్నారు. (‘అక్షయ్‌ని కాదని సుశాంత్‌ను తీసుకున్నాను‌’)

కరణ్ జోహార్, సల్మాన్ సహా చాలా మంది బంధుప్రీతి చూపిస్తున్నారంటూ అభిమానులు ఏకిపారేస్తున్నారు. దీనిపై స్పందించిన సల్మాన్ ఖాన్.. ఈ విషయంలో తన అభిమానులు .. సుశాంత్ అభిమానులకు తోడుగా ఉండాలని పిలుపు నిచ్చాడు. తాజాగా ప్రముఖ హీరోయిన్ రాఖీ సావంత్ సైతం సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై స్పందించారు. దీనికి సంబంధించి రాఖీ సావంత్ ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో  సుశాంత్ తన కలలో కనిపించి బాలీవుడ్‌ తనని వెలివేసిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. అంతేగాక త్వరలోనే సుశాంత్‌ తనకు బిడ్డగా జన్మించబోతున్నాడని ఈ సందర్భంగా రాఖీ వెల్లడించారు. దీంతో పాటు పూర్తి కానీ తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉంటే చేయాలని కోరినట్టు ఈ వీడియోలో రాఖీ సావంత్ తెలిపింది. (‘సుశాంత్‌ నెలసరి ఖర్చు రూ. 10 లక్షలు’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement