
లవ్ యూ విరాట్!
భారత క్రికెట్ వైస్‌కెప్టెన్ విరాట్ కొహ్లీతో తనకున్న రిలేషనేంటో... ప్రేమెంతో బాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్కాశర్మ ఇంతవరకు ఎక్కడా బయటపడలేదు.
భారత క్రికెట్ వైస్‌కెప్టెన్ విరాట్ కొహ్లీతో తనకున్న రిలేషనేంటో... ప్రేమెంతో బాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్కాశర్మ ఇంతవరకు ఎక్కడా బయటపడలేదు. తాజాగా ఈ బ్యూటీకి పోటీ వచ్చింది ఐటెమ్ బాంబ్ రాఖీ సావంత్. ఓ స్పా లాంచ్ సందర్భంగా రాఖీ తన మనసులో మాట చెప్పేసింది. ‘విరాట్ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. అతడిపై తనకు ప్రేమ ఉన్నట్టు అనుష్కా ఇప్పటి వరకు పబ్లిక్‌గా ప్రకటించలేదు. కానీ నేనలా కాదు...
విరాట్‌ను ప్రేమిస్తున్నా. ఆ విషయాన్ని చెప్పేందుకు నాకెలాంటి సందేహం లేదు’ అంటూ షాకిచ్చింది. ఇక వరల్డ్ కప్ మ్యాచ్ గ్యాప్‌లో విరాట్ కొహ్లీ అనుష్క లేటెస్ట్ మూవీ ‘ఎన్‌హెచ్10’ చూశాడట. వెంటనే ట్విట్టర్‌లో తన ఆనందాన్ని ఇలా షేర్ చేసుకున్నాడు... ‘సినిమా సూపర్. నా లవ్ అనుష్క యాక్షన్ అదుర్స్’ అని! మరి ఇప్పుడన్నా అనుష్క తొందర పడుతుందో లేదో చూడాలి! లేదంటే క్యూట్ బోయ్‌ని రాఖీ ఎగరేసుకుపోవడం ఖాయం!