
హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన రితేష్ సింగ్ తన భార్య స్నిగ్ధప్రియపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె ఓ వ్యక్తితో పారిపోవడానికి ప్రయత్నించిందని, తన కొడుకును కనీసం చూడటానికి కూడా అనుమతించలేదని ఆరోపించాడు. తాజాగా ఈ ఆరోపణలపై స్నిగ్ధప్రియ తీవ్రంగా స్పందించింది. 'అతడి ఇంటర్వ్యూల్లో నా మేనల్లుడితో నాకు సంబంధం అంటగట్టడం సహించలేకున్నాను. త్వరలోనే ఫిర్యాదు చేసి ఆయనకు బుద్ధి చెప్తాను. నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకోవట్లేదు. అందుకే అతడి నుంచి నా బిడ్డను దూరంగా ఉంచుతున్నాను' అని చెప్పుకొచ్చింది.
మరో ఇంటర్వ్యూలో రితేష్ రాఖీ సావంత్‌ను మోసం చేస్తున్నాడని పేర్కొంది. బిగ్‌బాస్ హౌస్‌లో రితేష్, రాఖీ సావంత్‌తో ప్రవర్తించిన తీరు నన్ను తీవ్రంగా బాధించింది చెప్పుకొచ్చింది. ఆరేళ్ల కొడుకుతోపాటు అధికారిక భార్యగా తానుండగా ఈ విషయాన్ని దాచిపెట్టి అతడు రాఖీసావంత్‌కు దగ్గరయ్యాడని విమర్శించింది. రాఖీతో అతడి బంధం చెల్లదని కుండ బద్ధలు కొట్టింది. వివాదం కారణంగా అతడు తమకు దూరంగా ఉంటున్నాడని వెల్లడించింది. అందరికీ చెప్పుకుంటున్నట్లుగా రితేష్ ఎన్‌ఆర్‌ఐ కాదని, అతడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మాత్రమేనని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment