ritesh
-
ఎల్బీ నగర్ విషాదంలో షాకింగ్ ట్విస్ట్..!
-
రైలులో మద్యం మత్తులో...
ఝాన్సీ: ఇటీవల విమానంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన సంఘటన గురించి విన్నాం. అలాంటి ఘటనపై ఉత్తరప్రదేశ్‌లో రైలులో జరిగింది. 19 ఏళ్ల రితేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఏసీ కంపార్ట్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తూ కింది బెర్తుపై నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై మద్యం మత్తులో మూత్ర విసర్జన చేశాడు. అతడిని అరెస్టు చేశామని ఆరీ్పఎఫ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. అయితే, అతడు ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని తేలినట్లు చెప్పారు. మూత్ర విసర్జన ఘటన జరగ్గానే దంపతులు రైలులో ఉన్న టీటీఈకి ఫిర్యాదు చేశారు టీటీఈ ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు సమాచారం చేరవేశాడు. రైలు ఝాన్సీ స్టేషన్‌కు చేరుకోగా పోలీసులు రితేశ్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు. రైల్వే చట్టం ప్రకారం జరిమానా చెల్లించిన రితేశ్‌ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. -
ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ పెళ్లి.. ఆహ్వానితుల్లో అత్యంత ప్రముఖులు!
దేశీయ హాస్పెటాలిటీ చెయిన్ ఓయోను స్థాపించిన రితేష్ అగర్వాల్ పెళ్లి మార్చి 7న ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో అత్యంత వైభవంగా జరగబోతోంది. ఈ విలాసవంతమైన వివాహానికి అత్యంత ప్రముఖులు చాలా మందినే ఆహ్వానించారు. పెళ్లికి ప్రముఖులు ఎవవరెవరు హాజరవుతున్నారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రితేష్ అగర్వాల్ ఇటీవల తన తల్లి, కాబోయే భార్యతో కలిసి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని పెళ్లికి ఆహ్వానించారు. ఈ పెళ్లికి ఆహ్వానితుల జాబితాలో ప్రధాని మోదీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఓయో బిజినెస్ కి సహకారం అందించిన ఎయిర్ బీఎన్బీ, లైట్ స్పీడ్ కామర్స్ వంటి సంస్థల అధినేతలు కూడా ఉన్నట్లు సమాచారం. అగర్వాల్ పెళ్లికి సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్ హాజరవుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ సంస్థ నివేదిక చెబుతోంది. ఓయో బిజినెస్‌లో అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టిన వాటిలో జపాన్‌కి చెందిన సాఫ్ట్ బ్యాంక్ కూడా ఒకటి. అందుకే రితేష్ అగర్వాల్ పెళ్లికి సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. చదవండి: Ex-Twitter employee: ఆఫీస్‌లో నేలపై పడుకుని అప్పట్లో వైరల్! అంతలా కష్టపడినా వేటు తప్పలేదు.. రితేష్ అగర్వాల్ ఒడిషాలోని రాయగడ్‌కు చెందిన మార్వాడీ కుటుంబంలో జన్మించారు. వారి కుటుంబం అక్కడ చిన్న కిరాణ దుకాణం నిర్వహించేది. రితేష్ సిమ్ కార్డ్స్ అమ్ముకునే వాడు. థీల్ ఫెల్లోషిప్లో తాను గెల్చుకున్న డబ్బుతో 2013లో ఓయో సంస్థను స్థాపించారు. ఈ వ్యాపారం అనతికాలంలోనే భారీగా విజయవంతమైంది. ఒకప్పుడు సాధారణ యువకుడైన రితేష్.. తన పెళ్లికి ఇప్పుడు పెద్ద పెద్ద వాణిజ్యవేత్తలు, ప్రముఖులు సైతం వచ్చేంత స్థాయికి ఎదిగారు. చదవండి: Aadhaar-Pan Linking: తరుముకొస్తున్న గడువు.. కానీ వీరికి ఆ టెన్షన్ లేదు! -
నా కొడుకును ఏం చేశారు?: సీఎం కేసీఆర్ అన్న కూతురు
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడు, ఎన్ఎన్యూఐ (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) తెలంగాణ జనరల్ సెక్రటరీ రేగులపాటి రితేశ్‌రావు ఆచూకీ చెప్పాలని సీఎం కేసీఆర్ అన్న కూతురు రేగులపాటి రమ్యారావు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆమె శనివారం శాంతిభద్రతల అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్‌ను డీజీపీ కార్యాలయంలో కలిశారు. ప్రివెంటివ్ అరెస్టు చేసిన పోలీసులు రితేశ్‌రావు ఎక్కడ ఉన్నాడన్న జాడ చెప్పడం లేదని ఆమె ఆరోపించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు అర్థరాత్రి తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్.. అంటున్న తెలంగాణ పోలీసులు తన కొడుకును పోలీసులు రక్షిస్తారా.. భక్షిస్తారా..? చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వాళ్లు ఉద్యమం ముసుగులో ఎన్నో దౌర్జన్యాలు చేశారని, అలాంటి వాళ్లకు ఇప్పుడు అసెంబ్లీలో రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అసలు హోంమంత్రి ఉన్నారా..? లేరా..? అని ప్రశ్నించారు. పోలీసులు వెంటనే తన కొడుకు రితేశ్‌రావు ఆచూకీ చెప్పడంతోపాటు.. క్షమాపణ చెప్పాలని రమ్యారావు డిమాండ్ చేశారు. -
నా భర్త నాకు వివాహేతర సంబంధం అంటగట్టాడు,
హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన రితేష్ సింగ్ తన భార్య స్నిగ్ధప్రియపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె ఓ వ్యక్తితో పారిపోవడానికి ప్రయత్నించిందని, తన కొడుకును కనీసం చూడటానికి కూడా అనుమతించలేదని ఆరోపించాడు. తాజాగా ఈ ఆరోపణలపై స్నిగ్ధప్రియ తీవ్రంగా స్పందించింది. 'అతడి ఇంటర్వ్యూల్లో నా మేనల్లుడితో నాకు సంబంధం అంటగట్టడం సహించలేకున్నాను. త్వరలోనే ఫిర్యాదు చేసి ఆయనకు బుద్ధి చెప్తాను. నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలనుకోవట్లేదు. అందుకే అతడి నుంచి నా బిడ్డను దూరంగా ఉంచుతున్నాను' అని చెప్పుకొచ్చింది. మరో ఇంటర్వ్యూలో రితేష్ రాఖీ సావంత్‌ను మోసం చేస్తున్నాడని పేర్కొంది. బిగ్‌బాస్ హౌస్‌లో రితేష్, రాఖీ సావంత్‌తో ప్రవర్తించిన తీరు నన్ను తీవ్రంగా బాధించింది చెప్పుకొచ్చింది. ఆరేళ్ల కొడుకుతోపాటు అధికారిక భార్యగా తానుండగా ఈ విషయాన్ని దాచిపెట్టి అతడు రాఖీసావంత్‌కు దగ్గరయ్యాడని విమర్శించింది. రాఖీతో అతడి బంధం చెల్లదని కుండ బద్ధలు కొట్టింది. వివాదం కారణంగా అతడు తమకు దూరంగా ఉంటున్నాడని వెల్లడించింది. అందరికీ చెప్పుకుంటున్నట్లుగా రితేష్ ఎన్ఆర్ఐ కాదని, అతడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రమేనని స్పష్టం చేసింది. -
ఇద్దరు మెడికోల ఆత్మహత్య!
హైదరాబాద్/ఏలూరు: ఒకే రోజున తెలుగు రాష్ట్రాల్లో విషాద మరణాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు మెడికోలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో నల్లగొండ జిల్లాకు చెందిన మెడికో పీజీ విద్యార్థిని శ్రావణి మత్తు మందు కలిపి సెలైన్‌ను ఎక్కించుకుని బలవన్మరణానికి పాల్పడగా, ఏలూరులో హౌస్ సర్జ్న్గా చేస్తున్న దానవాయిపేటకు చెందిన బలభద్ర రితేష్ (24) తాను ఉంటున్న హాస్టల్ 3వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికో విద్యార్థి రితేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రి మార్చూరీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిద్దరి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. జాంబాగ్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న శ్రావణి అనుమానాస్పదంగా మృతిచెందడంతో పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే శ్రావణి ఆత్మహత్యకు గల కారణాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థి శ్రావణి చనిపోయే ముందు తన తల్లిదండ్రులకు ఫోన్లో ఎస్ఎంఎస్తో సమాచారం ఇచ్చినట్టు అఫ్జల్‌గంజ్ సీఐ అంజయ్య వెల్లడించారు. మెడికో విద్యార్థిని శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు తెలిపారు. కాగా, ఓయూ పీజీ విద్యార్థిని శ్రావణి కళ్లను ఆమె కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రికి దానం చేశారు. -
ఏలూరులో మెడికో ఆత్మహత్య
ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా): ఏలూరులో ఓ మెడికో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దానవాయిపేటకు చెందిన డాక్టర్ వెంకటరాజు కుమారుడు బలభద్ర రితేష్(24) తన హాస్టల్ 3వ అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ల హౌస్ సర్జన్‌గా చేస్తున్న రితేష్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
చాంప్స్ రితేశ్, నితిన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రితేశ్, బాల కిషన్, నితిన్ కుమార్, అమలన్ బోర్గోహెన్ సత్తా చాటారు. రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో 100మీ. పరుగు విభాగంలో విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన 100మీ. పరుగు ఈవెంట్లో అండర్-14 బాలుర విభాగంలో రితేశ్ (11.7సె.), అభిశేఖర్ (11.9సె.), రాహుల్ (12.3సె.)... అండర్- 16 విభాగంలో బాలకిషన్ (11.2సె.), హరికృష్ణ (11.3సె.), చైతన్య (11.9సె.)... అండర్-18 విభాగంలో నితిన్ కుమార్ (11.0సె.), రామకృష్ణ (11.2సె.), సుధీర్ కుమార్ (11.3సె.)... అండర్-20 విభాగంలో అమలన్ (10.9సె.), నరేశ్ (11.0సె.), అయ్యప్ప ప్రసాద్ (11.2సె.)లు వరుసగా తొలి మూడు స్థానాల్ని సంపాదించారు. బాలికల 100మీ. పరుగులో అండర్ - 16 విభాగంలో దీప్తి (13.0సె.) మొదటి స్థానంలో నిలవగా... జంగు బాయ్ (13.4సె.), ఝాన్సీ (13.6సె.) రెండు, మూడు స్థానాల్ని సంపాదించుకున్నారు. అండర్-18 విభాగంలో భానుచంద్రిక (13.0సె.), విద్యశ్రీ (13.2సె.), చైతన్య (14.3సె.) తొలి మూడు స్థానాల్ని దక్కించుకున్నారు. ఇతర పోటీల విజేతల వివరాలు అండర్ -14 బాలురు 600మీ: 1. నిఖిల్ (1:29.5సె.), 2. సతీశ్ (1:29.7సె.), 3. అంజద్ (1:29.9సె.) లాంగ్‌జంప్: 1. సాయి తరుణ్ (5.56మీ.), 2. భార్గవ్ (5.32మీ.), 3. మధు (5.13మీ.) షాట్‌పుట్: 1. రవితేజ (12.72మీ.), 2. నగేశ్ (11.73మీ.), 3. వీరేంద్ర (11.15మీ.) బాలికలు 600మీ.: 1. భాగ్యలక్ష్మీ (1:41.3సె.), 2. మహాలక్ష్మీ (1:53.9సె.), 3. మౌనిక (1:56.5సె.) లాంగ్ జంప్: 1. మహేశ్వరి (4.10మీ.), 2. రుచిత (4.03మీ.), 3. గంగా జమున (4.03మీ.) షాట్‌పుట్: 1. నవీన (7.86మీ.), 2. భవ్య (7.06మీ.), 3. మేఘన (6.71మీ.) అండర్-16 బాలురు: 400మీ.: 1. అరవింద్ (51.2సె.), 2. రోహిత్ కుమార్ (53.9సె.), 3. అహ్మద్ జైన్ (55.0సె.) షాట్‌పుట్: 1. సత్యవాన్ (13.89మీ.), 2. రాము (11.70మీ.), 3. సిడ్నీ జాన్సన్ (11.59మీ.) బాలికలు 400మీ.: 1. ప్రేరణ లక్ష్మీ (1:09.9సె.), 2. గంగోత్రి (1:13.3సె.), 3. తరుణి (1:15.5సె.) అండర్-18 బాలురు: డిస్కస్ త్రో: 1. సాహిల్ (48.21మీ.), 2. శివ (39.90మీ.), 3. రవి (38.04మీ.) బాలికలు: 1. సాయిప్రియాంక (26.61మీ.), 2. మాన్విత (24. 77మీ.), 3. అలేఖ్య (22.60మీ.) అండర్-20 బాలురు: షాట్‌పుట్: 1. సాయి కుమార్ (13.42మీ.), 2.ధీరజ్ (11.17మీ.), 3. ఓంకార్ (10. 82మీ.) బాలికలు: డిస్కస్ త్రో: 1. మానస (23.15మీ.), 2. శిరీష (14మీ.), 3. నవీన (12.73మీ.) -
పెళ్లిసందడి