
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడు, ఎన్‌ఎన్‌యూఐ (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) తెలంగాణ జనరల్ సెక్రటరీ రేగులపాటి రితేశ్‌రావు ఆచూకీ చెప్పాలని సీఎం కేసీఆర్ అన్న కూతురు రేగులపాటి రమ్యారావు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆమె శనివారం శాంతిభద్రతల అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్‌ను డీజీపీ కార్యాలయంలో కలిశారు. ప్రివెంటివ్ అరెస్టు చేసిన పోలీసులు రితేశ్‌రావు ఎక్కడ ఉన్నాడన్న జాడ చెప్పడం లేదని ఆమె ఆరోపించారు.
అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు అర్థరాత్రి తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్.. అంటున్న తెలంగాణ పోలీసులు తన కొడుకును పోలీసులు రక్షిస్తారా.. భక్షిస్తారా..? చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ వాళ్లు ఉద్యమం ముసుగులో ఎన్నో దౌర్జన్యాలు చేశారని, అలాంటి వాళ్లకు ఇప్పుడు అసెంబ్లీలో రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అసలు హోంమంత్రి ఉన్నారా..? లేరా..? అని ప్రశ్నించారు. పోలీసులు వెంటనే తన కొడుకు రితేశ్‌రావు ఆచూకీ చెప్పడంతోపాటు.. క్షమాపణ చెప్పాలని రమ్యారావు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment