సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రితేశ్, బాల కిషన్, నితిన్ కుమార్, అమలన్ బోర్గోహెన్ సత్తా చాటారు. రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో 100మీ. పరుగు విభాగంలో విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన 100మీ. పరుగు ఈవెంట్‌లో అండర్-14 బాలుర విభాగంలో రితేశ్ (11.7సె.), అభిశేఖర్ (11.9సె.), రాహుల్ (12.3సె.)... అండర్- 16 విభాగంలో బాలకిషన్ (11.2సె.), హరికృష్ణ (11.3సె.), చైతన్య (11.9సె.)... అండర్-18 విభాగంలో నితిన్ కుమార్ (11.0సె.), రామకృష్ణ (11.2సె.), సుధీర్ కుమార్ (11.3సె.)... అండర్-20 విభాగంలో అమలన్ (10.9సె.), నరేశ్ (11.0సె.), అయ్యప్ప ప్రసాద్ (11.2సె.)లు వరుసగా తొలి మూడు స్థానాల్ని సంపాదించారు. బాలికల 100మీ. పరుగులో అండర్ - 16 విభాగంలో దీప్తి (13.0సె.) మొదటి స్థానంలో నిలవగా... జంగు బాయ్ (13.4సె.), ఝాన్సీ (13.6సె.) రెండు, మూడు స్థానాల్ని సంపాదించుకున్నారు. అండర్-18 విభాగంలో భానుచంద్రిక (13.0సె.), విద్యశ్రీ (13.2సె.), చైతన్య (14.3సె.) తొలి మూడు స్థానాల్ని దక్కించుకున్నారు.
ఇతర పోటీల విజేతల వివరాలు
అండర్ -14 బాలురు
600మీ: 1. నిఖిల్ (1:29.5సె.), 2. సతీశ్ (1:29.7సె.), 3. అంజద్ (1:29.9సె.)
లాంగ్‌జంప్: 1. సాయి తరుణ్ (5.56మీ.), 2. భార్గవ్ (5.32మీ.), 3. మధు (5.13మీ.)
షాట్‌పుట్: 1. రవితేజ (12.72మీ.), 2. నగేశ్ (11.73మీ.), 3. వీరేంద్ర (11.15మీ.)
బాలికలు
600మీ.: 1. భాగ్యలక్ష్మీ (1:41.3సె.), 2. మహాలక్ష్మీ (1:53.9సె.), 3. మౌనిక (1:56.5సె.)
లాంగ్ జంప్: 1. మహేశ్వరి (4.10మీ.), 2. రుచిత (4.03మీ.), 3. గంగా జమున (4.03మీ.)
షాట్‌పుట్: 1. నవీన (7.86మీ.), 2. భవ్య (7.06మీ.), 3. మేఘన (6.71మీ.)
అండర్-16 బాలురు:
400మీ.: 1. అరవింద్ (51.2సె.), 2. రోహిత్ కుమార్ (53.9సె.), 3. అహ్మద్ జైన్ (55.0సె.)
షాట్‌పుట్: 1. సత్యవాన్ (13.89మీ.), 2. రాము (11.70మీ.), 3. సిడ్నీ జాన్సన్ (11.59మీ.)
బాలికలు
400మీ.: 1. ప్రేరణ లక్ష్మీ (1:09.9సె.), 2. గంగోత్రి (1:13.3సె.), 3. తరుణి (1:15.5సె.)
అండర్-18 బాలురు:
డిస్కస్ త్రో: 1. సాహిల్ (48.21మీ.), 2. శివ (39.90మీ.), 3. రవి (38.04మీ.)
బాలికలు: 1. సాయిప్రియాంక (26.61మీ.), 2. మాన్విత (24. 77మీ.), 3. అలేఖ్య (22.60మీ.)
అండర్-20 బాలురు:
షాట్‌పుట్: 1. సాయి కుమార్ (13.42మీ.), 2.ధీరజ్ (11.17మీ.), 3. ఓంకార్ (10. 82మీ.)
బాలికలు: డిస్కస్ త్రో: 1. మానస (23.15మీ.), 2. శిరీష (14మీ.), 3. నవీన (12.73మీ.)
చాంప్స్ రితేశ్, నితిన్
Published Sun, Sep 25 2016 11:33 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
Advertisement
Advertisement