Adil Durrani Ex Girlfriend Warned to Rakhi Sawant, Deets Inside - Sakshi
Sakshi News home page

Rakhi Sawant: భర్తకు విడాకులు, ప్రియుడితో నటి ఎంగేజ్‌మెంట్‌.. మాజీ ప్రేయసి వార్నింగ్‌

Published Tue, May 24 2022 1:51 PM | Last Updated on Tue, May 24 2022 4:45 PM

Adil Durrani Ex Girlfriend Warned to Rakhi Sawant, Deets Inside - Sakshi

బిగ్‌బాస్‌ షో నుంచి బయటకు వచ్చాక నటి రాఖీ సావంత్‌ తరచూ వార్తల్లో నిలుస్తోంది. భర్త రితేశ్‌ సింగ్‌తో బ్రేకప్‌, అంతలోనే బిజినెస్‌మెన్‌తో లవ్‌, ఎంగేజ్‌మెంట్‌.. ఇలా నిత్యం సెన్సేషన్‌ అవుతోందీ నటి. ఇటీవలే తన ప్రియుడిని సైతం పరిచయం చేసింది. తనకంటే ఆరేళ్ల చిన్నవాడైన అదిల్‌ దురానీతో ప్రేమలో ఉన్నట్లు మీడియాకు వెల్లడించింది. అలా లవ్‌లో పడిందో లేదో అప్పుడే ప్రియుడి నుంచి బీఎమ్‌డబ్ల్యూ కారు సైతం కానుకగా అందుకుంది. ఈ మధ్య ఓ ఫంక్షన్‌లో ఆమె వేలికి డైమండ్‌ రింగ్‌ కనిపించడంతో వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగిపోయిందని అందరూ ఫిక్సైపోయారు.

ఇక నచ్చినవాడితో ఏడడుగులు వేద్దామనుకుంటున్న తరుణంలో రాఖీ సావంత్‌కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆ ఫోన్‌ చేసింది మరెవరో కాదు అదిల్‌ మాజీ ప్రేయసి రోషిన దెలవరి. అదిల్‌ తనవాడని, అతడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని వార్నింగ్‌ ఇచ్చిందట! అదిల్‌తో నాలుగేళ్లు రిలేషన్‌లో ఉన్నానని, అతడు ఎప్పటికీ తన సొంతమనే చెప్పిందట. ఈ మాటలు విని షాకైన రాఖీ వెంటనే ప్రియుడిని నిలదీయగా.. అతడు ఆమెతో ప్రేమలో పడ్డ విషయాన్ని అంగీకరించాడట. కాకపోతే అది గతమని, ఆమెతో ఎప్పుడో బ్రేకప్‌ అయిందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాఖీ ఓ ఇంటర్వ్యూలోనూ స్పష్టం చేస్తూ రోషిని అదిల్‌ ఎక్స్‌గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రమేనని తెలిపింది. ఏదేమైనా త్వరలో అతడిని పెళ్లాడబోతున్నానని చెప్పుకొచ్చింది.

చదవండి: నా సినిమాను చంపేశారు: శేఖర్‌ నిర్మాత ఆవేదన
విజయ్‌, సామ్‌కు గాయాలు.. నిజమా ? ఇదిగో క్లారిటీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement