అదిల్ దురానీ.. వివాదాస్పద నటి రాఖీ సావంత్‌తో నడిపిన ప్రేమాయణంతోనే ఇతడి పేరు అందరికీ తెలిసింది. అదిల్ కోసం, అతడి కుటుంబం కోసం పొట్టి బట్టలు వేసుకోవడం కూడా తగ్గించేసింది రాఖీ. సీక్రెట్‌గా అతడిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఆ గొడవలు ముదిరిపోవడంతో భర్తపై వేధింపుల కేసు పెట్టింది. ఈ కేసులో గతేడాది జైలుకు కూడా వెళ్లొచ్చాడు అదిల్. తర్వాత ఇద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
రహస్యంగా నిఖా చేసుకోలేదు
ఇటీవలే అదిల్ రెండో పెళ్లి చేసుకున్నాడు. నటి, బిగ్‌బాస్ ఫేమ్ సోమి ఖాన్‌ను పెళ్లాడాడు. ఈ రెండో పెళ్లి గురించి అతడు మాట్లాడుతూ.. 'చాలామంది నేను ఎలా మళ్లీ పెళ్లి చేసుకున్నానని అడుగుతున్నారు. నేనొక ముస్లింను.. కాబట్టి నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకునే అధికారం నాకుంది. నేనేమీ రహస్యంగా నిఖా చేసుకోలేదు. కుటుంబసభ్యుల అంగీకారంతో వారి సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాను. రిసెప్షన్ కూడా నిర్వహించాం.
మంచి లైఫ్ కోరుకోవడం తప్పా?
ఇప్పుడు నేను నా భార్యతోనే కలిసున్నాను. నాకంటూ మంచి జీవితం కోరుకోవడం తప్పు కాదే! రాఖీ(మాజీ భార్య) ఎప్పుడూ నెగెటివ్‌గానే ఉంటుంది. తను నాకు ఏనాడూ సంతోషాన్ని పంచలేదు. ఆమె ఎవరి జీవితంలో ప్రవేశించినా వారికి ఆనందమనేదే ఉండదు. కానీ నేను తనలా కాదు.. సంతోషాన్ని పంచుతాను. సోమి నా జీవితంలోకి వెలుగును తీసుకొచ్చింది. తనతో ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: ఓటీటీలో హారర్ సిరీస్.. తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్..
Comments
Please login to add a commentAdd a comment