ఎంపీల మత్తు వదిలించేందుకే.. రాఖీ సావంత్ | Want to contest LS polls to solve people's woes, says Rakhi Sawant | Sakshi
Sakshi News home page

ఎంపీల మత్తు వదిలించేందుకే.. రాఖీ సావంత్

Published Fri, Mar 28 2014 6:22 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఎంపీల మత్తు వదిలించేందుకే.. రాఖీ సావంత్ - Sakshi

ఎంపీల మత్తు వదిలించేందుకే.. రాఖీ సావంత్

షిర్డీ: ప్రజా సమస్యల్ని విస్మరించి నిద్రమత్తులో కూరుకుపోయిన ఎంపీలను మేల్కొలిపేందుకే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ చెబుతున్నారు. సామాన్యుల సమస్యలపై ఎంపీలు దృష్టి సారించేలా చేయాలని భావిస్తున్నానని చెప్పారు. ముంబై వాయవ్య నియోజవర్గం నుంచి ఆమె బరిలో దిగుతున్నారు. సాయినాథుని దర్శనార్థం శుక్రవారం వచ్చిన షిర్డీ వచ్చిన రాఖీ సావంత్ విలేకరులతో మాట్లాడారు. ఎంపీలు ప్రజల రక్తం తాగుతున్నారని విమర్శించారు.

ఏ పార్టీ టికెట్పై పోటీచేస్తున్నారన్న ప్రశ్నకు.. ఎదురు చూడండి అంటూ ఆసక్తిని రేకెత్తించారు. శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు చెప్పారు. బాలీవుడ్లో ఉన్నందుకు సంతోషంగా ఉందని, ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని రాఖీ సావంత్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement