మీటూ ఆరోపణలు ఎదుర్కొన్న దర్శకుడు సాజిద్ ఖాన్‌ను వెంటనే బిగ్‌బాస్ షో నుంచి తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే! పలువురు తారలు అతడి వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెడుతూ సాజిద్‌ను షోలో కొనసాగించవద్దని కోరుతున్నారు. ఈ క్రమంలో అతడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది నటి రాఖీ సావంత్. సాజిద్‌ను బతకనివ్వండంటూ మీడియా ముందు ఏడ్చేసింది.
ఇంకా రాఖీ మాట్లాడుతూ.. 'నిజం చెప్పాలంటే, సాజిద్ నాలుగేళ్లుగా శిక్ష అనుభవించాడు. అప్పుడెందుకు ఎవరూ నోరు మెదపలేదు. హో.. ఇప్పుడు అతడు బిగ్‌బాస్‌కు వెళ్లాడు, ఈ సమయంలో అతడి గురించి మాట్లాడితే మీరు హైలైట్ అయి జనాల కంట్లో పడతారనా..! అతడు అమాయకుడా? నిందితుడా? అనేది నాకు తెలియదు. కానీ నాలుగేళ్ల నుంచి సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్నాడు. ఇంత శిక్ష అనుభవించాక కూడా ఇంకా అతడిని దోషిగానే చూస్తారా? ఇన్నేళ్ల తర్వాత బిగ్‌బాస్ ఆఫర్ వస్తే ఇప్పుడు పనిగట్టుకుని పబ్లిసిటీ స్టంట్ కోసం అతడి మీద రాళ్లు రువ్వుతున్నారు. ఇందుకు మీరు కాస్తైనా సిగ్గుపడాలి. తను కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు మీరెందుకు అడ్డుపడుతున్నారు.
సాజిద్ నాకు చుట్టమో, స్నేహితుడో కాదు. కానీ మానవత్వం ఉన్న మనిషిగా అతడి పరిస్థితిని అర్థం చేసుకోగలను. అందరూ అతడిమీద ఇలాగే ద్వేషాన్ని చూపిస్తే అది తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నా చేసుకుంటాడు' అంటూ ఏడ్చేసింది రాఖీ సావంత్. ఒకవేళ తనకు బిగ్‌బాస్ షోలోకి వెళ్లే అవకాశం వస్తే అతడి మీద వచ్చిన ఆరోపణలు నిజమా? కాదా? అని సాజిద్‌నే నిలదీసి నిజం బయటపెడతానని చెప్పింది బిగ్‌బాస్ బ్యూటీ.
చదవండి: నాగచైతన్య మూవీలో ఆ హీరోయిన్
ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పిన సమంత
Comments
Please login to add a commentAdd a comment