Rakhi Sawant Reveals Why She Changed Her Dressing Sense, Details Inside - Sakshi
Sakshi News home page

Rakhi Sawant: మావాడికి నేను ఎక్స్‌పోజింగ్‌ చేస్తే నచ్చట్లే, అందుకే ఇలా..

Published Sun, Jun 26 2022 4:27 PM | Last Updated on Sun, Jun 26 2022 4:48 PM

Rakhi Sawant Reveals Why She Her Changed Dressing Sense - Sakshi

బిగ్‌బాస్‌ షోతో బాగా పాపులర్‌ అయింది రాఖీ సావంత్‌. కానీ ఎప్పుడైతే షో నుంచి బయటకు వచ్చిందో అప్పటినుంచి ఆమెను కష్టాలు వెంటాడాయి. తను ఎంతగానో ప్రేమించి పెళ్లాడిన వ్యక్తికి ఇదివరకే వివాహమైందని తెలియడంతో ఆమె గుండె పగిలేలా ఏడ్చింది. భార్యాబిడ్డలున్న వ్యక్తితో తాను జీవితం పంచుకుని వారికి మోసం చేయలేనంటూ అతడికి విడాకులిచ్చేసింది. అయితే కొంతకాలానే వ్యాపారవేత్త అదిల్‌ దురానీతో ప్రేమలో పడింది. రాఖీనే సర్వస్వం అనుకున్న అతడు ఆమెతో పెళ్లికి ముందే ప్రియురాలి కోసం ఖరీదైన కారు, బంగ్లా కొనిపెట్టాడు. అయితే రాఖీకి ఓ షరతు పెట్టాడు. ఎక్స్‌పోజింగ్‌ ఉండే బట్టలు వేసుకోవద్దని సూచించాడు. మొదట్లో రాఖీ ఆ మాటలను పెద్దగా లక్ష్య పెట్టలేదు. కానీ అదిల్‌ కుటుంబానికి కూడా తన డ్రెస్సింగ్‌ సెన్స్‌ నచ్చకపోవడంతో చివరకు తనే మనసు మార్చుకుంది. శరీరాన్ని వీలైనంతవరకు కప్పి ఉంచే బట్టలనే ధరిస్తోంది.

తాజాగా ఈ విషయంపై రాఖీ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో ఉండాలంటే స్కిన్‌ షో చేయడం తప్పనిసరి. సల్వార్‌ డ్రెస్‌తో కెరీర్‌ ఆరంభించినా తర్వాతి సినిమాలో బికినీ వేసుకోక తప్పదు. ఎందుకంటే ఇండస్ట్రీలో నాకు గాడ్‌ ఫాదర్‌ ఎవరూ లేరు. స్వయంకృషితోనే ఆఫర్లు తెచ్చుకోవాలి. కానీ అదిల్‌కు నేను ఎక్స్‌పోజింగ్‌ చేసేలా డ్రెస్సులు వేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అవార్డుల ఫంక్షన్‌కు నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో అదిలే నిర్ణయిస్తాడు. అతడు ఎంపిక చేసినవాటినే నేను ధరిస్తున్నాను. అటు ఇండస్ట్రీని, ఇటు అదిల్‌ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని ఓ లిమిట్‌లో ఉండాలనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా రాఖీ సావంత్‌ హిందీ బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌తో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లోనూ హౌస్‌లో అడుగుపెట్టి హల్‌చల్‌ చేసింది.

చదవండి: ప్రియుడితో సీరియల్‌ నటి పెళ్లి, ఫొటోలు చూశారా?
 ఏడువారాల నగలు కొనిచ్చిన కార్తీకదీపం నటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement