
బిగ్‌బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్ వైవాహిక జీవితం చిక్కుల్లో పడింది. ఇప్పటికే తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రాఖీకి తన ప్రవర్తనతో తలనొప్పిలా తయారయ్యాడు ఆమె భర్త అదిల్ దురానీ. అదిల్ తనను కాదని మరో అమ్మాయితో తిరుగుతున్నాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది నటి. జిమ్ నుంచి బయటకు వస్తూ అక్కడున్న మీడియాతో తన గోడు వెల్లబోసుకుంది రాఖీ సావంత్.
'నా పెళ్లి ప్రమాదంలో పడింది. అదిల్ మరో అమ్మాయికి దగ్గరవుతున్నాడు. ఖురాన్ మీద ఒట్టేసి మరీ ఆ అమ్మాయి నెంబర్ బ్లాక్ చేసి తనను మర్చిపోతానన్నాడు. కానీ అతడు మాట తప్పాడు. అదిల్ పెద్ద మోసగాడు. ఆ అమ్మాయి దగ్గర కొన్ని డర్టీ ప్రూఫ్స్ ఉండటంతో నా భర్తను బ్లాక్‌మెయిల్ చేస్తోంది. దయచేసి ఎవరూ అదిల్‌ను ఇంటర్వ్యూ చేయకండి. ఎందుకంటే అతడు నన్ను వాడుకుని ఇండస్ట్రీకి వద్దామనుకున్నాడు. జిమ్‌కు నాకోసం వచ్చేవాడు కాదు. నా ద్వారా ఇంటర్వ్యూలతో ఫేమస్ అవుదామనుకున్నాడు. కాబట్టి ఎవరూ అతడిని స్టార్‌ను చేయొద్దు. అదిల్‌ను పెళ్లి చేసుకుంటే నాకంటూ మంచి కుటుంబం ఉంటుందనుకున్నా. అతడితో కలిసి బిడ్డను కనాలనుకున్నా. అంతలోనే ఇన్ని శిక్షలు.. ఎందుకు మా ఇద్దరి మధ్యలో దూరి నన్ను టార్చర్ పెడుతున్నారు..' అంటూ బోరుమని విలపించింది రాఖీ.
చదవండి: బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమాగా రికార్డ్
స్టార్ హీరో నన్ను కాల్ గర్ల్‌లా వాడుకున్నాడు: నటి
Comments
Please login to add a commentAdd a comment