Rakhi Sawant Asks Her Fan To Not Touch Her While Tries To Click Selfie - Sakshi
Sakshi News home page

Rakhi Sawant: నాకు పెళ్లైంది.. నన్ను ముట్టుకోకు.. వైరల్‌గా మారిన నటి వీడియో

Published Tue, Jan 17 2023 12:43 PM | Last Updated on Tue, Jan 17 2023 2:07 PM

Rakhi Sawant Asks Her Fan to Not Touch Her While Tries To Click Selfie - Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ గతేడాది జూలైలో ప్రియుడిని సీక్రెట్‌గా పెళ్లాడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇటీవలే సోషల్‌ మీడియాలో లీక్‌ కావడంతో నిజంగానే తమ పెళ్లి జరిగిపోయిందని స్పష్టం చేసింది. కానీ ఆమె ప్రియుడు అదిల్‌ ఖాన్‌ మాత్రం రాఖీని పెళ్లి చేసుకోలేదని వాదించాడు. ఆ తర్వాత మాత్రం కొన్ని పరిస్థితుల వల్ల నిజాన్ని దాయాల్సి వచ్చిందని చెప్తూ వివాహం చేసుకున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. దీంతో వీరి పెళ్లి గోల ముగిసిపోయింది.

అయితే రాఖీకి అదిల్‌ మొదటి నుంచే కొన్ని కండీషన్లు పెట్టాడు. పొట్టి, కురచ దుస్తులు ధరించడానికి వీల్లేదని, కాస్త పద్ధతిగా తయారవ్వాలని నిబంధనలు విధించాడు. ఇష్టమొచ్చిన డ్రెస్సులు వేస్తే తన కుటుంబానికి నచ్చదని చెప్పాడు. దీంతో ప్రియుడి కోసం అతడి కుటుంబం కోసం తన డ్రెస్సింగ్‌ స్టైల్‌ మార్చింది రాఖీ. అదిల్‌ సెలక్ట్‌ చేసిన దుస్తులే వేసుకునేది. ఇకపోతే అతడిని పెళ్లాడిన విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాక సంతోషంతో గాల్లో తేలియాడుతుందామె.

ఈ క్రమంలో తాజాగా ఓ అభిమానితో ఆమె ప్రవర్తించిన తీరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఓ అభిమాని రాఖీతో సెల్ఫీ దిగేందుకు కాస్త దగ్గరగా జరిగాడు. దీంతో రాఖీ.. 'హలో బ్రదర్‌.. ‌కాస్త దూరంగా ఉండు.. ఇప్పుడు నాకు పెళ్లైంది' అని చెప్పింది. అందుకు ఆ వ్యక్తి సరేనని తలూపుతూనే సెల్ఫీ దిగాడు. 'ఇంతకుముందంటే వేరు, కానీ ఇప్పుడు మీరు నన్ను ముట్టుకోవడానికి కూడా వీల్లేదు, అర్థమైందా?' అని చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాఖీ మాటలు విన్న నెటిజన్లు పడీపడీ నవ్వుతున్నారు. 'పోయిన ఏడాది వివాహం చేసుకుని ఇప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్నట్లు బిల్డప్‌ ఇస్తుందేంటి?', 'అబ్బో, టచ్‌ చేయొద్దా.. భలే కామెడీగా మాట్లాడుతుందే..' అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: మూడేళ్ల తర్వాత సుశాంత్‌ను చేరుకున్న పెంపుడు కుక్క
రవితేజ ఖాకీ డ్రెస్‌ వేస్తే సినిమా బ్లాక్‌బస్టరే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement