బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్ వ్యవహారం కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది అదిల్ దురానీని పెళ్లాడిన ఆమె ఇటీవలే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కానీ అంతలోనే అతడు తనను వేధిస్తున్నాడని, అతడికి మరో అమ్మాయితో లవ్ ఎఫైర్ ఉందంటూ సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా అదిల్ తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూలో అదిల్‌పై మరోసారి ఆరోపణలు గుప్పించింది రాఖీ. 'అదిల్ నన్ను చిత్రహింసలు పెట్టేవాడు. తనను హీరో చేయమని కొట్టేవాడు. తనొక పెద్ద వ్యాపారవేత్త అని, నాకు కారు, బంగ్లా గిఫ్ట్‌గా ఇచ్చానని గొప్పలు చెప్పమనేవాడు. ఒకవేళ అలా చెప్పకపోతే నన్ను పెళ్లి చేసుకోనని, నాకు చుక్కలు చూపిస్తానని హెచ్చరించాడు. వేరే అమ్మాయిలతో బెడ్ షేర్ చేసుకుని, ఆ వీడియోలు నాకు పంపిస్తానన్నాడు. వాటిని చూసి నేను గుండెపోటుతో చావాలని కోరుకున్నాడు. అతడికి వ్యతిరేకంగా వెళ్తే ఎవరికైనా 50 వేలు ఇచ్చి నన్ను ట్రక్కుతో గుద్దిచ్చి చంపుతానన్నాడు. అదిల్‌కు ఆల్‌రెడీ పెళ్లయింది, విడాకులు కూడా అయ్యాయి. ఆ విషయం నా దగ్గర దాచిపెట్టి మోసం చేశాడు. అతడికి చాలామందితో ఎఫైర్లు ఉన్నాయి. అటు అమ్మ చనిపోయింది, ఇటు భర్త నన్ను దారుణంగా మోసం చేశాడు. జీవచ్ఛవంలా బతికున్నాను' అని విలపించింది రాఖీ సావంత్.
Comments
Please login to add a commentAdd a comment