ఎప్పుడూ ఎదో వివాదంతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ మరోసారి హాట్ టాపిక్‌గా వార్తల్లో నిలిచారు. వివాదస్పద సినిమాలతోనో, మాటలతోనో, డ్రెస్స్‌లతోనో వార్తల్లో నిలిచే రాఖీ తాజాగా తన చేష్టలతో వార్తల్లో నిలిచారు. పంజాబ్‌కు చెందిన ఓ మహిళా రెజ్లర్ సవాల్ విసరగా.. రాఖీ స్వీకరించారు. రింగ్‌లో ఇద్దరూ తలపడే ముందు తనతో సమానంగా నృత్యం చేయాలని రాఖీ ప్రతి సవాల్ విసిరారు. దీనికి అంగీకరించిన రెజ్లర్ రాఖీతో సమానంగా నృత్యం చేసింది. అనంతరం రాఖీ సావంత్‌ను మహిళా రెజ్లర్ తన భుజాలమీదకు ఎత్తుకుని అమాంతం కింద పడేసింది. దీంతో సుమారు 8 నిమిషాల పాటు రాఖీ బాధతో విలవిలలాడిపోయారు. వెంటనే నిర్వాహకులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని పంచకులలో ద గ్రేట్ ఖలీ నిర్వహిస్తున్న సీడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ రెజ్లింగ్ పోటీల్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం రాఖీ సావంత్ రెజ్లింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. (నష్టాల్లో ఉన్నా అందుకే 25 పైసలు)
వివాదాలకు కేరాఫ్ అడ్రస్
బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా.. నటి రాఖీ సావంత్ మాత్రం తనుశ్రీపై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లుగా మౌనం వహించిన తనుశ్రీ ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతోందని విమర్శలు గుప్పించారు. ‘తనుశ్రీ పదేళ్ల నుంచి కోమాలో ఉంది.. ఆమెకి పిచ్చి పట్టిందం’టూ రాఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా తనుశ్రీ డ్రగ్స్ తీసుకుంటుందని, రేవ్ పార్టీకి తీసుకెళ్లి పలుమార్లు తనపై అత్యాచారం చేసిందని.. తనుశ్రీ ఓ లెస్బియన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన తనుశ్రీ, రాఖీపై రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఇక రాఖీ కూడా అసత్య ఆరోపణలతో తనుశ్రీ తన పరువుకు భంగం కలిగించారంటూ 25 పైసల నష్టపరిహారం కోరిన విషయం తెలిసిందే. (‘నేను లెస్బియన్‌ని కాదు’)
Comments
Please login to add a commentAdd a comment