Wrestling Bout
-
రాఖీ సావంత్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్
-
వైరల్: రాఖీ సావంత్‌ను ఎత్తి పడేసింది
ఎప్పుడూ ఎదో వివాదంతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ మరోసారి హాట్ టాపిక్‌గా వార్తల్లో నిలిచారు. వివాదస్పద సినిమాలతోనో, మాటలతోనో, డ్రెస్స్‌లతోనో వార్తల్లో నిలిచే రాఖీ తాజాగా తన చేష్టలతో వార్తల్లో నిలిచారు. పంజాబ్‌కు చెందిన ఓ మహిళా రెజ్లర్ సవాల్ విసరగా.. రాఖీ స్వీకరించారు. రింగ్‌లో ఇద్దరూ తలపడే ముందు తనతో సమానంగా నృత్యం చేయాలని రాఖీ ప్రతి సవాల్ విసిరారు. దీనికి అంగీకరించిన రెజ్లర్ రాఖీతో సమానంగా నృత్యం చేసింది. అనంతరం రాఖీ సావంత్‌ను మహిళా రెజ్లర్ తన భుజాలమీదకు ఎత్తుకుని అమాంతం కింద పడేసింది. దీంతో సుమారు 8 నిమిషాల పాటు రాఖీ బాధతో విలవిలలాడిపోయారు. వెంటనే నిర్వాహకులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పంజాబ్‌లోని పంచకులలో ద గ్రేట్ ఖలీ నిర్వహిస్తున్న సీడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ రెజ్లింగ్ పోటీల్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం రాఖీ సావంత్ రెజ్లింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. (నష్టాల్లో ఉన్నా అందుకే 25 పైసలు) వివాదాలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా.. నటి రాఖీ సావంత్ మాత్రం తనుశ్రీపై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లుగా మౌనం వహించిన తనుశ్రీ ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతోందని విమర్శలు గుప్పించారు. ‘తనుశ్రీ పదేళ్ల నుంచి కోమాలో ఉంది.. ఆమెకి పిచ్చి పట్టిందం’టూ రాఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా తనుశ్రీ డ్రగ్స్ తీసుకుంటుందని, రేవ్ పార్టీకి తీసుకెళ్లి పలుమార్లు తనపై అత్యాచారం చేసిందని.. తనుశ్రీ ఓ లెస్బియన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన తనుశ్రీ, రాఖీపై రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఇక రాఖీ కూడా అసత్య ఆరోపణలతో తనుశ్రీ తన పరువుకు భంగం కలిగించారంటూ 25 పైసల నష్టపరిహారం కోరిన విషయం తెలిసిందే. (‘నేను లెస్బియన్‌ని కాదు’) -
ఒలింపిక్ ప్లేయర్‌ను ఓడించిన రాందేవ్
-
ఒలింపిక్ ప్లేయర్‌ను ఓడించిన రాందేవ్
యోగా గురువు బాబా రాందేవ్ తాను విసిరిన సవాల్లో నెగ్గి భళా అనిపించుకున్నారు. 2008 ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో రజత పతకం సాధించిన ఆండ్రీ స్టాడ్నిక్‌ను తనతో తలపడి గెలవాల్సిందిగా బాబా రాందేవ్ సవాలు విసిరారు. తాను ప్రతిరోజు వ్యాయామం చేస్తానని, దానివల్ల ఎంతో శక్తి చేకూరుతుందని ముందుగానే హెచ్చరించిన రాందేవ్ బుధవారం రాత్రి ఆండ్రీ స్టాడ్నిక్ తో జరిగిన కుస్తీ పోటీలో గెలుపొందారు. ఈ బౌట్లో 12-0 పాయింట్లతో ఒలింపిక్ ప్లేయర్ ను ఓడించారు. నాలుగు పాయింట్లతో ఖాతా తెరచిన రాందేవ్, వరుస పాయింట్లు సాధిస్తూ 7-0 ఆధిక్యంలోకి వెళ్లి.. బౌట్ ముగిసేసరికి మరో ఐదు పాయింట్లు సాధించడంతో పాటు ఒలింపిక్ ప్లేయర్‌కు కనీసం ఒక్క పాయింట్‌ను కూడా కోల్పోకపోవడం గమనార్హం. మ్యాచ్ ముగియగానే రాందేవ్‌ను విన్నర్‌గా ప్రకటించగానే భారత్ మాతా కి జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. ముందుగా బౌట్ ప్రారంభానికి ముందు రాందేవ్ సూర్య నమస్కారాలు చేశారు. ప్రత్యర్థి స్టాడ్నిక్‌ను ఆశీర్వదించి కుస్తీ ప్రారంభించారు యోగా గురువు. బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఓడించిన స్టాడ్నిక్ ఈ గేమ్‌లో ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయారు. రాందేవ్ బాబా మ్యాట్‌పై చాలా చురుగ్గా కదులుతూ ప్రత్యర్థిని తికమక పెట్టారు. యోగా గురువు వరుస పాయింట్లు సాధిస్తున్నా.. స్టాడ్నిక్ మాత్రం ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. బుధవారం రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కి ముందు ఆండ్రీ స్టాడ్నిక్, రాందేవ్‌ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ వీక్షకులకు వినోదాన్ని పంచింది. జాతీయ ఆటగాళ్లను ఓడించిన రాందేవ్, ఓ అంతర్జాతీయ స్థాయి ఆటగాడిని ఓడించడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. బౌట్ ముగిసిన అనంతరం రాందేవ్ బాబా మాట్లాడుతూ.. రాబోయో రోజుల్లో భారత్‌లో రెజ్లింగ్‌కు ప్రాముఖ్యం ఏర్పడుతుందని, అత్యంత ఆదరణ ఉన్న ఆటగానూ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
ఒలింపిక్ కుస్తీయోధుడికి రాందేవ్ చాలెంజ్
ప్రస్తుతం పతంజలి ప్రోవీటా ప్రో రెజ్లింగ్ లీగ్ జరుగుతోంది. ఇందులో హర్యానా హేమర్స్, జైపూర్ నింజాస్ తమ తొలి సెమీ ఫైనల్లో బుధవారం తలపడతారు. అయితే.. దీనికంటే ఆసక్తికరమైన విషయం మరోటి ఉంది. 2008 ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో రజత పతకం సాధించిన ఆండ్రీ స్టాడ్నిక్‌ను తనతో తలపడి గెలవాల్సిందిగా బాబా రాందేవ్ సవాలు చేశారు. ఇది అందరికీ పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. బక్క పలచగా ఉండే బాబా రాందేవ్ ఏంటి.. అసలు రెజ్లింగ్ చేయడం ఏంటని అంతా అనుకుంటున్నారు. యోగాలో అంటే ఆయనకు తిరుగులేదు గానీ, రెజ్లింగ్ గురించి తెలుసా అని చర్చించుకుంటున్నారు. బుధవారమే జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కి ముందు ఆండ్రీ స్టాడ్నిక్, రాందేవ్‌ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ ఒకటి జరగనుంది. తాను ప్రతిరోజూ వ్యాయామం చేస్తానని, తన శక్తిని పెంచుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని, అలాగే సమయం చిక్కినప్పుడల్లా అఖాడాకు వెళ్లి రెజ్లింగ్ కూడా చూస్తానని రాందేవ్ చెబుతున్నారు. తాను ఇంతకుముందు జాతీయస్థాయి రెజ్లర్లతో తలపడ్డానని, కానీ ఒక అంతర్జాతీయ క్రీడాకారుడితో తలపడితే మరింత ఎగ్జయిటింగ్‌గా ఉంటుందని అన్నారు. ఈ మ్యాచ్‌లో యోగా రియల్ పవర్ ఏంటో చూస్తారని కూడా ఊరిస్తున్నారు. ఈ చాలెంజ్ విషయం తెలియగానే ఆండ్రీ ముందు ఆశ్చర్యపోయాడు. కానీ, బాబా రాందేవ్ సిద్ధమవుతున్న విషయం తెలిసి, ఎలాగైనా ఆయనతో తలపడాల్సిందేనని సిద్ధమయ్యాడు. అయితే.. రాందేవ్ ఇలా రెజ్లర్లతో పోరాడటం ఇది మొదటిసారి ఏమీ కాదు. గత సంవత్సరం హరిద్వార్‌లో తమ ఆశ్రమం 20వ వార్షికోత్సవం సందర్భంగా రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన సుశీల్ కుమార్‌ను చాలెంజ్ చేశారు. ఆ మ్యాచ్ తర్వాత.. బాబా నిజంగానే రెజ్లింగ్‌ను సీరియస్‌గా తీసుకుంటే ఆయన దేశంలోనే అత్యుత్తమ రెజ్లర్లలో ఒకరు అయ్యేవారని సుశీల్ చెప్పాడు! మరిప్పుడు ఆండ్రీ ఏమంటాడో చూడాలి.