
తేజీందర్ పాల్ సింగ్ బగ్గా(బీజేపీ), దివ్యా స్పందన(కాంగ్రెస్)
సాంకేతిక అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు కూడా ప్రచారం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నాయి. అధికార ప్రతినిధులు, బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు సైతం ఇతర పార్టీలపై బురద జల్లేందుకు సోషల్ మీడియాలో చౌకబారు విమర్శలకు దిగడం సర్వసాధారణమైపోయింది. తాజాగా కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్ కమ్యూనికేషన్స్ చీఫ్ దివ్యా స్పందన, ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తేజీందర్ పాల్ సింగ్ బగ్గాలు పరస్పరం టార్గెట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టుల ద్వారా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు.
బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌కు సంబంధించిన పాత వీడియోను పోస్ట్ చేసిన దివ్యా స్పందన... ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి...‘మోదీజీ... మీకు అల్లుడు దొరికాడు’ అంటూ ట్వీట్ చేశారు. దివ్య ట్వీట్‌కు కౌంటర్‌గా తేజీందర్ పాల్ సింగ్... అలహాబాద్‌కు చెందిన ఒక గుర్తు తెలియని మహిళ వీడియోను పోస్ట్ చేసి.. ‘ సోనియా గాంధీ గారు మీ కోడలు దొరికారు’ అంటూ ట్వీట్ చేశారు.
ఆ వీడియోల్లో ఏముందంటే...
న్యూయార్క్ ట్రిప్‌లో ఉన్నరాఖీ సావంత్ తనకు కాబోయే భర్త దొరికాడంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ‘ఫ్రెండ్స్.. నాకు కాబోయే భర్త ఎవరా అంటూ అడుగుతూ ఉంటారు కదా. ఇదిగో ఇతడిని కలవండి. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. అతడితో పాటు న్యూయార్క్‌లో విహరిస్తున్నాను. నా ఈ వీడియోను ప్రధాని మోదీతో సహా భారతీయులంతా చూస్తూ ఉంటారు. బాలీవుడ్ నటిని అయిన కారణంగా మోదీ నాకు పెద్ద అభిమాని. ఇదిగోండి ఈయనే మీ అల్లుడు’ అంటూ రాఖీ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను జూలై 9న దివ్యా స్పందన తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
తేజీందర్ సింగ్ పోస్ట్ చేసిన వీడియోలో... అలహాబాద్‌కు చెందిన ఒక మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన భర్త అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పెళ్లి చేసుకుని భార్య హోదా కల్పిస్తానని రాహుల్ చెప్పారంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయన రోజూ తన కలలోకి వచ్చి ఎన్నో వాగ్దానాలు చేస్తారని, కానీ వాటిని నిలబెట్టుకోకుండా తనను మోసం చేశారంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. దళితులంటే ఎంతో ప్రేమ కలిగి ఉండే రాహుల్ ఓబీసీ మహిళనైన తనను పెళ్లి చేసుకుంటే బాగుంటుందంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా రాహుల్ గాంధీపై పలు సంచలన ఆరోపణలు చేశారు.
“मोदी जी आपका दामाद मिल गया है” @narendramodi @rakhisawant7 pic.twitter.com/RhSRLSxpIR
— Divya Spandana/Ramya (@divyaspandana) July 9, 2018
“सोनिया जी आपकी बहु मिल गई है” @RahulGandhi pic.twitter.com/DDKhmrm9RY
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) July 9, 2018
Comments
Please login to add a commentAdd a comment